ఎన్నో ప్రకృతి అందాలకు నిలయం కర్ణాటక. జలపాతాల నుంచి పచ్చటి అడవుల వరకు.. ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకునే ఎన్నో విశేషాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి ప్రకృతి అందాల మధ్య నిర్వహించే రేసులో రయ్ రయ్ మంటూ దూసుకుపోతే? 'ఆహా ఆ కిక్కే వేరప్పా...' అని అనుకుంటున్నారా? అయితే వెంటనే చిక్కమగళూరుకు వెళ్లి.. "ఆఫ్-రోడ్ జీప్ రేస్"లో పాల్గొనాల్సిందే.
ట్రాక్ అదుర్స్...
ఈ జీప్ రేస్‌ను మంగళవారం నిర్వహించారు. కరోనా సంక్షోభం అనంతరం జరిగిన తొలి రేస్ కావడం వల్ల.. దీనికి విశేష ఆదరణ లభించింది. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన దాదాపు 50మందికిపైగా రైడర్లు ఈ రేసులో పాల్గొన్నారు.
ఈ రేసులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ట్రాక్ గురించే. కాఫీ పొలాలు, అడవులు, కొండలు, బురద, చెరువుల మధ్యలో దాదాపు 30కిలోమీటర్ల పొడవున ఈ ట్రాక్ నిర్మించారు. ఫలితంగా రైడర్లకు సాహసం చేసిన అనుభూతితో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశమూ లభించింది. తమ జీవితంలో ఇదొక అత్యద్భుతమైన రైడ్ అని చెప్పారు వారు.
![An Adventurous off-road jeep Race in Chikkamagaluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-ckm-03-rally-pkg-7202347_15092020153932_1509f_1600164572_78_1509newsroom_1600170799_783.jpg)
![An Adventurous off-road jeep Race in Chikkamagaluru](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-ckm-03-rally-pkg-7202347_15092020153932_1509f_1600164572_209_1509newsroom_1600170799_853.jpg)
ఇదీ చూడండి:- ఐదుగురు భర్తలుండగా.. 22 ఏళ్ల ప్రియుడితో ఆరో పెళ్లి!