పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన మహిళను మొబైల్ ఫోను వెలుతురులో ప్రసవించేలా చేశారు వైద్యులు. ఈ ఘటన కర్ణాటక కలబుర్గిలోని కల్లూర్ గ్రామంలో జరిగింది.
సిద్దమ్మ అనే మహిళ ప్రసవ వేదనతో స్థానిక ఆసుపత్రికి చేరుకోగా అప్పటికే ఆ ప్రాంతంలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. తప్పని పరిస్థితుల్లో వైద్యులు మొబైల్ టార్చ్ వెలుతురులోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చేలా చేశారు.
ఆసుపత్రిలో పవర్ బ్యాకప్ లేకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి సరైన ఏర్పాట్లు చేయాలని ఆరోగ్యాధికారులను కోరారు.