ETV Bharat / bharat

మండ్య ఎంపీ సుమలతకు కరోనా - మాండ్య ఎంపీ

ప్రముఖ సినీనటి, రాజకీయ నాయకురాలు సుమలతకు కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. వైద్యుల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు ఆమె తెలిపారు.

Actor-politician Sumalatha Ambareesh tests positive for coronavirus
ప్రముఖ సినీనటి సుమలతకు కరోనా పాజిటివ్​
author img

By

Published : Jul 6, 2020, 7:14 PM IST

Updated : Jul 6, 2020, 7:39 PM IST

కర్ణాటక మండ్య ఎంపీ, ప్రముఖ సినీనటి సుమలతకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె ఫేస్​బుక్ ద్వారా తెలిపారు.

"శనివారం నుంచి తలనొప్పి, గొంతు గరగర లాంటి లక్షణాలు కనిపించాయి. నియోజకవర్గం పర్యటన సందర్భంగా నాకు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నా. వైద్య పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం నేను మా ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నాను. వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స తీసుకుంటున్నాను. నాకు రోగనిరోధక శక్తి బాగానే ఉంది. అభిమానుల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని బలంగా నమ్ముతున్నాను."

- సుమలత అంబరీశ్, మండ్య ఎంపీ

'నేను ఇప్పటి వరకు ఎవరిరెవరితో కలిసానో.. వారందరి వివరాలు అధికారులకు చెప్పాను. అలాగే నన్ను కలిసిన వారందరూ... దయచేసి కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను' అని సుమలత పేర్కొన్నారు.

సుమలత తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ భాషా చిత్రాల్లో నటించారు. భర్త అంబరీశ్​ మరణాంతరం రాజకీయాల్లోకి ప్రవేశించి, మండ్య ఎంపీగా గెలిచారు.

ఇదీ చూడండి: జవాన్లు ఎంతటి చలినైనా తట్టుకునేలా ప్రత్యేక టెంట్లు

Last Updated : Jul 6, 2020, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.