మహారాష్ట్ర అనురాగ్బాద్లోని ఓ జంతు ప్రదర్శనశాలలో.. రాత్రంతా పులుల పక్కనే గడిపాడో యువకుడు. పీసాదేవీ సమీపంలోని శ్రీకృష్ణ నగర్‌కు చెందిన రవీంద్ర ససానే.. మానసిక స్థితి బాలేదు. అర్థరాత్రి జూ వెనకభాగం నుంచి గోడ దూకాడు. తాను పడిన ప్రదేశం పులులు సంచరించేందకు ప్రత్యేకంగా కేటాయించినది. అది తెలియని రవీంద్ర.. రాత్రంతా పులులకు అతి సమీపంగా గడిపాడు. అయితే, అదృష్టం బాగుండి రాత్రి క్రూర మృగాలను బోనులో బంధిచారు కాబట్టి బతికి బయటపడ్డాడు.
ఉదయం జూ తెరిచిన సిబ్బంది పులుల ప్రదేశంలో ఆ యువకుడిని చూసి ఖంగుతిన్నారు. వెంటనే జూ అధికారులకు సమాచారమిచ్చారు. అధికారులు రవీంద్రను పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి:వలస గోస: బతుకు బండికి అన్నదమ్ములే కాడెడ్లు