ETV Bharat / bharat

​ చెక్​పోస్ట్​ వేదికగా.. పోలీసుల​ సాక్షిగా కల్యాణం! - checkpost marriage telugu news

ఎన్నో జంటలు.. ఈ ఏడు ఎలాగైనా కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకుని పెళ్లి ముహూర్తాలు పెట్టేసుకున్నాయి. అంతలోనే లాక్​డౌన్ ఒకటి మొదాలాయే.​ నిబంధనలు కాదని పెళ్లి చేసుకుంటే పోలీసులు ఊరుకోరాయే. దీంతో వేలాది వివాహాలు వాయిదాపడ్డాయి. అయితే, మహారాష్ట్రకు చెందిన ఓ జంటకు మాత్రం పోలీసులే దగ్గరుండి పెళ్లి చేశారు. చెక్​పోస్ట్​ వేదికగా జరిగిన ఆ పెళ్లి కథ ఏంటంటే...

a-marriage-at-police-checkpost-washim-maharastra
​ చెక్​పోస్ట్​ వేదికగా.. పోలీసుల​ సాక్షిగా కల్యాణం!
author img

By

Published : May 19, 2020, 9:59 AM IST

మహారాష్ట్రకు చెందిన ఓ జంటకు పోలీస్​ చెక్​పోస్టే కల్యాణ మండపమైంది. పోలీసులే పెళ్లి పెద్దలయ్యారు.

​ చెక్​పోస్ట్​ వేదికగా.. పోలీసుల​ సాక్షిగా కల్యాణం!

వాశీం జిల్లాకు చెందిన అరవింద్​ ఆత్మారామ్​కు.. పక్క జిల్లాకు చెందిన అమ్మాయి​తో వివాహం నిశ్చయమైంది. అయితే లాక్​డౌన్​ ఎత్తివేసిన వెంటనే పెళ్లి చేసుకుందామని ఇన్నాళ్లుగా వేచిచూశాడు అరవింద్​. కానీ, ప్రభుత్వం లాక్​డౌన్​ పొడిగిస్తూనే ఉందని విసుగు చెంది పెళ్లి ముహూర్తం పెట్టించేశాడు. అయితే, పెళ్లిరోజున వరుడి అలంకరణలో వధువు ఇంటికి బయల్దేరిన అరివింద్​ను జిల్లా చెక్​పోస్ట్​ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.

లాక్​డౌన్​ కారణంగా ఆత్మారామ్​ను జిల్లా దాటేదిలేదన్నారు. అయితే, అంతా సిద్ధమయ్యాక వివాహాన్ని వాయిదా వేయడం పోలీసులకు భావ్యం అనిపించక.. వధువును చెక్​పోస్ట్​ వద్దకే పిలిపించారు. భౌతిక దూరం పాటిస్తూ వారిద్దరికీ పెళ్లి చేశారు పోలీసులు.

ఇదీ చదవండి:ఆకుపచ్చ కోడిగుడ్డు.. అదరగొట్టేసే డిమాండు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.