ETV Bharat / bharat

స్పీడు పెంచిన కరోనా- 'మహా'లో కొత్తగా 6,555 కేసులు - corona latest toll

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మహారాష్ట్రలో వైరస్ తీవ్రరూపం దాల్చింది. ఇవాళ రికార్డు స్థాయిలో 6,555 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, దిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో వైరస్​ వేగంగా విస్తరిస్తోంది.

COVID-19 cases
'మహా'లో ఆగని కరోనా ఉద్ధృతి
author img

By

Published : Jul 5, 2020, 9:21 PM IST

Updated : Jul 5, 2020, 9:56 PM IST

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్యలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 6,555 మందికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. మరో 151 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్​ నుంచి నేడు 3,658 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,06,619కి చేరింది. మరణాలు 8,822కు చేరగా.. ఇప్పటివరకు 1,11,740 మంది వైరస్​ బారి నుంచి బయటపడ్డారు.

తమిళనాడులో...

తమిళనాడులో కొవిడ్​-19​ పంజా విసురుతోంది. కొద్ది రోజులుగా రోజుకు నాలుగువేలకుపైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ 4,150 మందికి కొత్తగా వైరస్​ పాజిటివ్​గా తేలింది. మరో 60 మంది ప్రాణాలు కోల్పోయారు.

దిల్లీలో...

దిల్లీలో ఇవాళ మరో 2,505 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. మరణాలు సంఖ్య 3,067కు చేరింది. ఇవాళ 63 మంది ప్రాణాలు కోల్పోయారు.

బంగాల్​లో..

బంగాల్​లో కరోనా వైరస్​ వేగంగా వ్యాపిస్తోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 895 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు నమోదైన కేసుల సంఖ్యలో ఇదే అత్యధికం. ఈరోజు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 22,126కు మరణాలు 757కు చేరాయి.

వైరస్​ ప్రభావం తక్కువగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లోనూ విస్తరిస్తోంది ఈ మహమ్మారి. అరుణాచల్​ప్రదేశ్​లో ఇవాళ 7, పుదుచ్చేరిలో 43, నాగాలాండ్​లో 28 కొత్త కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంకొత్త కేసులుమరణాలుమొత్తం కేసులుమొత్తం మరణాలు
మహారాష్ట్ర6,555151 2,06,6198,822
తమిళనాడు4,150601,11,1511,510
దిల్లీ 2,5056399,4443,067
కర్ణాటక1,9253723,474372
బంగాల్8952122,126757
గుజరాత్​ 7251836,1231,945
యూపీ1,15312 27,707785
కేరళ225-520425
ఎంపీ3261014,930608

Last Updated : Jul 5, 2020, 9:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.