దేశవ్యాప్తంగా ఉన్న కరోనా బాధితుల్లో 6.39 శాతం మందికే ఆస్పత్రుల్లో వైద్యం అవసరమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారిలో 2.94శాతం మందికి ఆక్సిజన్, 3 శాతం మందికి ఐసీయూ, మిగిలిన 0.45శాతానికి వెంటిలేటర్లు అవసరమని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు.
7.9మంది మాత్రమే
ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 42,298 మంది కోలుకోగా... 61,149 మంది చికిత్స పొందుతున్నారని లవ్ అగర్వాల్ వెల్లడించారు. లాక్డౌన్ అమలు చేసిన మొదట్లో 7.1శాతంగా ఉన్న రికవరీ రేటు ప్రస్తుతం 39.62కు పెరిగిందని తెలిపారు.
దేశంలో కరోనా వల్ల ప్రతి లక్ష మందిలో 7.9 మంది మాత్రమే ప్రభావితమయ్యారని ఆరోగ్య శాఖ పేర్కొంది.
నిషేధించే యోచనలో ఉందా?
కొవిడ్-19 చికిత్సలో ఉపయోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను నిషేధించే యోచనలో ప్రభుత్వం ఉందా? అనే ప్రశ్నకు... మలేరియా ఔషధం సమర్థతపై సమీక్ష నిర్వహిస్తామని భారతీయం వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) సమాధానమిచ్చింది.
ఇదీ చూడండి: 'మీడియాకు ప్రభుత్వాల బకాయిలు రూ.1,800 కోట్లు'