కుటుంబ సభ్యులు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల స్థానికులతో కలిసి తన తల్లి అంత్యక్రియలను ముందుండి నిర్వహించింది ఓ కుమార్తె. తల్లి చితికి తనే నిప్పంటించింది ఝార్ఖండ్‌లోని రామ్‌గఢ్‌కు చెందిన 20 ఏళ్ల యువతి.
తల్లికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో యువతి ఆర్తనాదాలు చూసి చలించిపోయారు స్థానికులు.