ETV Bharat / bharat

18 మంది సైనికులకు లేహ్​లో చికిత్స - india china war latest news

గాల్వన్​ లోయలో చైనాతో ఏర్పడిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన 18 మంది భారత జవాన్ల ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సైనికాధికారులు తెలిపారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురు సైనికులు ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు.

soldiers injured in Galwan Valley clash
నిలకడగా ఆ 18 మంది సైనికుల ఆరోగ్యం!
author img

By

Published : Jun 18, 2020, 5:15 AM IST

తూర్పు లద్దాక్​లోని గాల్వన్​ లోయ ప్రాంతంలో సోమవారం(జూన్​ 16న) రాత్రి భారత్​-చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తి 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో 18 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారికి లేహ్​లోని మిలిటరీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అందులో నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉండగా.. ప్రస్తుతం వారు చికిత్సకు స్పందిస్తున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

50 మందికి స్వల్ప గాయాలు..

స్వల్పంగా గాయపడిన మరో 50 మంది జవాన్లకు చికిత్స అందించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని తెలిపారు ఆర్మీ అధికారులు. వారంతా రెండు వారాల్లో విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

35 మంది చైనీయులు..

అర్ధరాత్రి గాల్వన్​ లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో చైనా వైపు కూడా భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు అంచనాలు ఉన్నా.. డ్రాగన్​ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే.. అమెరికా నిఘా విభాగం నివేదిక ప్రకారం 35 మంది మరణించినట్లు తెలిసింది.

ఇదీ చూడండి: సరిహద్దులో గస్తీ కాస్తున్న త్రివిధ దళాలు 'హై అలర్ట్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.