కొవిడ్ నుంచి రక్షణ పొందాలంటే.. మాస్కు ధరించడం, తరచూ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడం కీలకమైనవి. అయితే ఒకే శానిటైజర్‌ను ఎక్కువమంది వినియోగించాల్సి వచ్చినప్పుడు.. అందరూ దాన్ని ముట్టుకోక తప్పదు. అటువంటి సందర్భాల్లో వైరస్ ఒకరి నుంచి మిగిలిన వారికి సోకే ప్రమాదముంది. అందుకే ఈ సమస్యను అధిగమించేందుకు 'నో టచ్ శానిటైజర్'ను ఆవిష్కరించాడు బెంగళూరుకు చెందిన 14 ఏళ్ల విద్యార్థి కృష్ణ గుప్తా. రోబోటిక్ సాంకేతికతతో దీన్ని రూపొందించినట్లు చెప్పుకొచ్చాడు.
"కరోనా మహమ్మారి వల్ల శానిటైజర్‌కు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. మా ఇంట్లో అందరం ఒకే శానిటైజర్‌ను వినియోగిస్తాం. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ దాన్ని చేత్తో ముట్టుకోక తప్పడం లేదని గమనించా. అప్పుడే రోబో సాంకేతికతో పనిచేసే నో టచ్ శానిటైజర్ ఆలోచన నా మదిలో మెదిలింది. దీని ద్వారా శానిటైజ్ చేసుకునేందుకు ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు. మన అరచేతులను సెన్సార్లు గుర్తించగానే.. ఈ రోబో శానిటైజర్‌ను విడుదల చేస్తుంది."
- కృష్ణ గుప్తా, విద్యార్థి
ఇదీ చదవండి: వైద్యులకు, వైరస్‌కు మధ్య అడ్డు 'పెట్టె'