ETV Bharat / bharat

దేశవ్యాప్తంగా 7 కోట్లు దాటిన కరోనా టెస్టులు

రోజూ దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 75 శాతం పది రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోనే వెలుగుచూస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కొవిడ్​ నిర్ధరణ పరీక్షల సంఖ్య 7 కోట్లు దాటినట్లు స్పష్టం చేసింది.

author img

By

Published : Sep 26, 2020, 5:23 PM IST

10 states, UTs account for 75 pc of new COVID-19 cases, total tests cross 7 cr: Centre
దేశవ్యాప్తంగా 7 కోట్లు దాటిన కరోనా టెస్టులు

దేశంలో కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్య 7 కోట్లు దాటినట్లు వెల్లడించింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. రోజుకు సగటున 14 లక్షల టెస్టులు నిర్వహించే సామర్థ్యానికి చేరుకుందని స్పష్టం చేసింది. ప్రతి 10 లక్షల జనాభాకు 50 వేల 920 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించింది. బాధితులు వేగంగా కోలుకుంటున్నారని తెలిపిన ఆరోగ్య శాఖ.. కరోనా పాజిటివిటీ రేటు 8.40 శాతంగా ఉందని స్పష్టం చేసింది.

10 states, UTs account for 75 pc of new COVID-19 cases, total tests cross 7 cr: Centre
7 కోట్లు దాటిన టెస్టులు

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజూ నమోదవుతున్న కరోనా కేసుల్లో 75 శాతం 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుంచే ఉంటున్నాయని తెలిపింది. అవి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఉత్తర్​ ప్రదేశ్​, ఒడిశా, దిల్లీ, బంగాల్​, ఛత్తీస్​గఢ్​ కొత్త కేసుల నమోదులో వరుసగా 10 స్థానాల్లో ఉన్నాయని పేర్కొంది ఆరోగ్య శాఖ.

24 గంటల వ్యవధిలో నమోదైన మరణాల్లో ఈ రాష్ట్రాల నుంచే 83 శాతం ఉన్నాయని తెలిపింది.

ఆయా రాష్ట్రాల్లో కేసుల వివరాలు

భారత్​లో కొత్తగా 85 వేల 362 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1089 మంది కొవిడ్​కు బలయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 59 లక్షల మార్కు దాటింది. మరణాలు 93 వేల 379కి చేరాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.