ETV Bharat / bharat

షాపింగ్​కు తీసుకెళ్లలేదని బాలిక సూసైడ్​, లారీ కింద పడ్డ యువకుడు - Upset over not being taken to shopping by parents girl commits suicide

Girl Commits Suicide ఇప్పటి తరం పిల్లలు ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తారో ఎవరికి అర్థం కాదు. పబ్​జీ హవా నడుస్తున్న సమయంలో తమను ఆడుకోనివ్వలేదని ఎందరో పిల్లలు ప్రాణాలు వదిలిన ఘటనలు మనం చూసుంటాం. ఇలాంటి చిన్నచిన్న కారణాలకు నిరాశ చెందే చిన్నారులు కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. ఇలాంటి ఘటనే బెంగుళూరులో జరిగింది.

Girl Commits Suicide
Girl Commits Suicide
author img

By

Published : Aug 23, 2022, 12:29 PM IST

Updated : Aug 23, 2022, 12:49 PM IST

Girl Commits Suicide: సాధారణంగా తల్లిదండ్రులు బయటకు వెళ్తున్న సమయంలో ఇంట్లో ఉండే పిల్లలు తమను వారి వెంట తీసుకొని వెళ్లమని గొడవ చేస్తుంటారు. తల్లిదండ్రులు వారికి ఏదో ఒకటి సర్ది చెప్పి వెళ్లిపోతుంటారు. ఈ ఇంట్లోనూ అదే జరిగింది కానీ దానికి పరిణామం ఆ బిడ్డ తనువు చాలించడం.
తనను షాపింగ్​కు వెంట తీసుకెళ్లలేదని ఐదో తరగతి విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటక బెంగుళూరులోని చామరాజపేటలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. చామరాజనగర్​లో నివాసముంటున్న ఓ కుటుంబం పండగ సందర్భంగా తమ పిల్లల కోసం షాపింగ్​ చేయాలనుకున్నారు. రెండు రోజుల క్రితమే పెద్ద కుమార్తె వైశాలి కోసం డ్రెస్​ కొనుక్కుని వచ్చారు. శనివారం మిగతా ఇద్దరు పిల్లల కోసం షాపింగ్ చేయడానికి బయలుదేరారు. తాను వస్తానని వైశాలి పట్టుబట్టడంతో వారు ఆమెకు నచ్చజెప్పి మిగతా ఇద్దరు పిల్లల్ని తీసుకుని వెళ్లిపోయారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన వైశాలి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబసభ్యులు షాక్​కు గురయ్యారు. తల్లిదండ్రులు చామరాజనగర్​ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

లారీ కింద పడి సూసైడ్​..
గుజరాత్​లోని రాజకోట్​​​​ పరిధిలోని గ్రీన్​ల్యాండ్​ చౌక్​ వద్ద ఒక యువకుడు లారీ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీసీటీవీ ఫుటేజ్​ సామాజిక మాధ్యమాలలో వైరలవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భారీ ట్రక్​ కింద హఠాత్తుగా దూకిన దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసులు అతని వద్ద ఓ ఫోన్​ ఉన్నట్లు గుర్తించారు. దాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి విచారణ చేపట్టారు. మృతిచెందిన యువకుడి పేరు నీలమ్​ అని తెలిపారు. అతని కుటుంబసభ్యుల కోసం వెతుకుతున్నారు.

సీసీటీవీ విజువల్స్​

ఇదీ చదవండి: నిరసన చేస్తున్న విద్యార్థిని చావబాదిన ఏడీఎం, చేతిలో జెండా ఉన్నా

భారతరత్నకు అర్హుడైన సిసోదియాపై సీబీఐ దాడులు సిగ్గుచేటు కాదా

Last Updated : Aug 23, 2022, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.