Padma Awards 2022: భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించేందుకు బంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య తిరస్కరించారు.
"ఈ అవార్డు గురించి నాకు ఏమీ తెలియదు. దాని గురించి ఎవరూ చెప్పలేదు. వారు(ప్రభుత్వం) నాకు పద్మభూషణ్ ఇవ్వాలని నిర్ణయించుకుంటే.. నేను దానిని స్వీకరించేందుకు నిరాకరిస్తున్నాను" అని బుద్ధదేవ్ ఓ ప్రకటనలో తెలిపారు. భట్టాచార్య, పార్టీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ(ఎం) వర్గాలు తెలిపాయి.
అయితే కేంద్ర హోంశాఖ మంత్రిత్వ కార్యాలయానికి చెందిన ఓ సీనియర్ అధికారి ద్వారా అవార్డు గురించి బుద్ధదేవ్ కుటుంబానికి తెలియజేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
2022 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన దేశ తొలి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్(మరణానంతరం), యూపీ మాజీ సీఎం దివంగత కళ్యాణ్ సింగ్, ప్రభ ఆత్రే, మహారాష్ట్రశ్రీ రాధేశ్యామ్ ఖామ్కే(మరణానంతరం), కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్, సీపీఐ(ఎం) నేత బంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య పద్మభూషణ్ సహా పలువురు ప్రముఖులు ఈ గౌరవం పొందిన వారి జాబితాలో ఉన్నారు.
ఇదీ చూడండి: Padma Awards 2022: పద్మ అవార్డులు వరించింది వీరినే..