BEL Recruitment 2023: ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి నుంచి వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా మరో ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి రెండు జాబ్ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మేనేజర్ పోస్టు కోసం విశ్రాంత నేవీ అధికారుల నుంచి ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఇవ్వనుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ..21.01.2023 అని బీఈఎల్ తెలిపింది.
అర్హతలు
- మేనేజర్ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కమాండర్ ర్యాంక్‌లో పనిచేసి ఉండాలి.
- కమాండర్ కాకపోతే లెఫ్ట్‌నెంట్ కమాండర్‌గా 4 సంవత్సరాల సీనియారిటీ ఉండాలి.
- అభ్యర్థి తప్పనిసరిగా బీఈ/ బీటెక్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
- వయోపరిమితి- 45 ఏళ్లలోపు వారు మాత్రమే అర్హులు.
- జీతం- సంవత్సరానికి సుమారు రూ.20 లక్షలు.
ఎలా అప్లై చేసుకోవాలి?
- బీఈఎల్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి.
- ఆఫ్‌లైన్ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- సక్రమంగా తప్పులు లేకుండా దరఖాస్తును నింపాలి.
- అనంతరం డిప్యూటీ జనరల్ మేనేజర్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు పోస్ట్ చేయాలి.
2023 జనవరి 21వ తేదీ తర్వాత వచ్చిన అప్లికేషన్లు తిరస్కరణకు గురవుతాయి. అయితే కేవలం 'ఒక్క పోస్ట్' కోసమే బీఈఎల్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంపికైన వారికి విశాఖపట్నం లేదా కోల్‌కతాలో పోస్టింగ్ ఇవ్వనుంది.
ఇంజినీర్ పోస్ట్‌లు..
బీఈఎల్ ఇటీవలే మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ విభాగాల్లో 13 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. అప్లై చేసుకోవడానికి జనవరి 15ను ఆఖరి తేదీగా నిర్ణయించింది.
ట్రైనీ ఇంజినీర్:
కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఈ విద్యార్హత పొంది ఉండాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో బీటెక్ పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు కనీస మార్కులతో పాసైతే చాలు. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.30,000 వేతనం ఉంటుంది.
ప్రాజెక్ట్ ఇంజినీర్:
గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి బీఈ/బీటెక్ పూర్తి వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు 55 శాతం, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీస మార్కులతో పాసై ఉండాలి. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.40,000 వేతనం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
ట్రైనీ ఇంజినీర్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.150, ప్రాజెక్ట్ ఇంజినీర్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వారు రూ.450 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: రైల్వే జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్.. ఇంటర్ పాసైతే చాలు.. ఇంకో 6 రోజులే గడువు