కర్ణాటక మైసూరు దసరా ఉత్సవాల్లో అంబారిని మోసే 'బలరామ' ఏనుగు మరణించింది. 67 ఏళ్ల బలరామ కొంతకాలంగా క్షయవ్యాధితో బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆదివారం తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూసింది. ఇప్పటికి దసరా ఉత్సవాల్లో 14 సార్లు 'అంబారీ'ని మోసి ఏనుగు రికార్డు సృష్టించింది.
అనారోగ్యంతో బాధపడుతున్న ఏనుగు.. హన్సర్ రేంజ్ నాగర్హోల్ పార్క్‌లోని భీమనకట్టె ఎనుగుల క్యాంప్‌లో వెటర్నరీ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతుంది. మొదట అల్సర్ బారిన పడ్డ ఏనుగు తర్వాత కోలుకుంది. 10 రోజుల తర్వాత మళ్లీ అనారోగ్యానికి గురికాగా పరీక్షలు చేశారు. ఈ ఫలితాల్లో క్షయ వ్యాధితో బాధపడుతున్నట్లు తేలడం వల్ల వైద్యులు ఆ మేరకు చికిత్స అందించారు. అయితే, ఏనుగు గత వారం నుంచి ఎటువంటి ఆహారాన్ని తీసుకోలేదని వైద్యులు తెలిపారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఏనుగు ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధరించారు. పోస్టుమార్టం పరీక్షలు చేసి, ఏనుగు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
బలరామ ప్రత్యేకత
బలరామ ఏనుగు 1958లో జన్మించింది. మైసూర్లో నిర్వహించే దసరా ఉత్సవాలు ప్రఖ్యాతిగాంచినవి. ఈ దసరా పండగ సందర్భంగా నిర్వహించే ఉత్సవాల్లో బలరామ ఏనుగు అంబారీ మోసేది. 1999 నుంచి 2011 సంవత్సరాల మధ్య జరిగిన ఉత్సవాల్లో అత్యధికంగా 14 సార్లు చాముండేశ్వరీ దేవి అమ్మవారి విగ్రహాన్ని 'గోల్డెన్ హౌదా'(అంబారీ)ని మోసింది. ఉత్సవాల్లో భాగంగా 10 వ రోజు పవిత్రమైన చాముండేశ్వరీ దేవి అమ్మవారి విగ్రహాన్ని అంబారీలో మోసే బలరామ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. 1987లో కర్ణాటకలోని సోమ్వార్పేట రేంజ్ కట్టెపురా అటవీ ప్రాంతంలో మొదటిసారి బలరామ ఏనుగును గుర్తించారు.
ఈ రోబో ఏనుగును చూశారా..
సాధారణంగా దేవాలయాల్లో దేవుడి విగ్రహాల ఊరేగింపు కోసం ఏనుగులను ఉపయోగిస్తూ ఉంటారు. గుడిలోని వివిధ పూజా కార్యక్రమాల్లో, అలంకరణకు సైతం ఏనుగుల సహాయం తీసుకుంటారు. ఆ సమయంలో ఆయా ఏనుగులు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాయి. అదీ కాక ఈ ఏనుగులు గుడి ప్రాగంణంలోనే ఉండాల్సి ఉంటుంది. వాటికి బాహ్య ప్రపంచంలో విహరించటానికి వీలు ఉండదు. వాటి సహజ జీవితాన్ని సైతం ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ఈ కారణంగా ఏనుగులు తమ స్వేచ్ఛను కోల్పోయో అవకాశం కూడా ఉంది. ఈ సమస్యలు గుర్తించిన ఫీపుల్ ఫర్ ఎత్నిక్ ట్రీట్మెంట్ యానిమల్స్ (పెటా) ఇండియా అనే ఓ స్వచ్ఛంద సేవా సంస్థ వినూత్నంగా ఆలోచించి ముందుకొచ్చింది. కేరళ ఇరింజదప్పిల్లిలోని శ్రీకృష్ణ ఆలయానికి ఓ రోబోటిక్ ఏనుగును విరాళంగా అందించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవీ చదవండి: