ETV Bharat / bharat

భవనం పైనుంచి శిశువును పడేసిన కోతి.. చిన్నారి అక్కడికక్కడే.. - పసికందు మృతి

Monkey Throws Baby: నాలుగు నెలలను పసికందును ఓ కోతుల గుంపు పొట్టనపెట్టుకుంది. మూడో అంతస్తుపై నుంచి పిల్లాడ్ని ఓ కోతి కిందకు విసిరేసింది. దీంతో ఆ నవజాత శిశువు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

baby-dies-after-being-thrown-off-three-storey-building-by-monkey

author img

By

Published : Jul 17, 2022, 10:55 PM IST

Monkey Throws Baby: ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలీ జిల్లాలో విషాద ఘటన జరిగింది. మూడు అంతస్తుల భవనంపై నుంచి ఓ నాలుగు నెలల పసికందును కోతి కిందకు విసరేసింది. దీంతో ఆ నవజాత శిశువు అక్కడిక్కడే మృతి చెందాడు.

ఇదీ జరిగింది.. జిల్లాలోని డంకా గ్రామానికి చెందిన నిర్దేశ్ ఉపాధ్యాయ భార్య ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. శుక్రవారం సాయంత్రం నిర్దేశ్​​ దంపతులు.. తమ కొడుకును తీసుకుని ఇంటి డాబాపైకి వెళ్లి వాకింగ్​ చేస్తున్నారు. అదే సమయంలో ఓ కోతుల గుంపు వారిమీదికి వచ్చింది. ఇద్దరు భార్యాభర్తలు.. కోతులను తరిమికొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా వానరాలు బెదరలేదు. దీంతో చేసేదేమీ లేక.. నిర్దేశ్​​ దంపతులు పిల్లాడ్ని తీసుకుని మెట్లవైపు పరిగెత్తారు. అకస్మాత్తుగా నిర్దేశ్​ చేతి నుంచి పిల్లవాడు జారిపడిపోయాడు.

కింద పడిన కొడుకును నిర్దేశ్​ తీసుకునేలోపు.. ఓ కోతి వచ్చి పసికందును పట్టుకుని మూడో అంతస్తు పైనుంచి కిందకు విసరేసింది. దీంతో చిన్నారి నేలమీద పడి అక్కడిక్కడే మరణించాడు. తమ కొడుకును కోతుల గుంపు పొట్టనపెట్టుకోవడంతో నిర్దేశ్ దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నామని తెలిపారు.

ఇవీ చదవండి: కరెంట్ బిల్లు చూసి పిచ్చెక్కి.. విద్యుత్ తీగలపై పాకుతూ హల్​చల్!

'చెత్త వాహనం'పై స్టంట్స్.. ప్రమాదకరంగా పుష్అప్స్.. సడన్​గా కిందపడి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.