ETV Bharat / bharat

'ప్రాణప్రతిష్ఠకు రండి'- అయోధ్య కేసు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ఆహ్వానం - అయోధ్య రామాలయం ఓపెనింగ్​కు అతిథులు

Ayodhya Ram Mandir Guest List : జనవరి 22న ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో రామ్​లల్లా ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ మహాత్సవానికి ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం అందింది. తాజాగా రామమందిర వివాదంపై తీర్పు ఇచ్చిన అప్పటి సీజేఐ సహా ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించింది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​.

Ayodhya Ram Mandir Guest List
Ayodhya Ram Mandir Guest List
author img

By PTI

Published : Jan 19, 2024, 5:12 PM IST

Updated : Jan 19, 2024, 5:51 PM IST

Ayodhya Ram Mandir Guest List : జనవరి 22న ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో రామ్​లల్లా ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ మహాత్సవానికి ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం అందింది. తాజాగా రామమందిర వివాదంపై తీర్పు ఇచ్చిన అప్పటి సీజేఐ సహా ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను రామమందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించింది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​.

వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ, అయన కుటుంబ సభ్యులు, ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్​పర్సన్ కుమార్ మంగళం బిర్లా, ఆయన భార్య, పిరమల్ గ్రూప్ ఛైర్​పర్సన్ అజయ్ పిరమల్, మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్​ ఆనంద్ మహీంద్రా, టీసీఎస్​ సీఈఓ కృతివాసన్​ను రామాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించింది రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​. బాలీవుడ్ బిగ్​బీ అమితాబ్ బచ్చన్​ సహా దేశంలోని ప్రముఖ క్రీడాకారులు, రాజకీయ ప్రముఖులు, దౌత్యవేత్తలు సహా దాదాపు 8వేల మందిని ఆహ్వానించింది.

బాలీవుడ్ బిగ్​బీ అమితాబ్ బచ్చన్ 161 అడుగుల ఎత్తైన ఇసుక రాయితో ప్రైవేట్ ఛార్టర్ట్​ విమానంలో రామ్​లల్లా ప్రాణప్రతిష్ఠకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. జనవరి 22న అయోధ్యకు ప్రైవేట్ జెట్‌లలో కొందరు అతిథులు వెళ్లనున్నారు. మరికొందరు ఒక రోజు ముందుగానే విమానాల్లో అయోధ్య, లఖ్​నవూ చేరుకుని అక్కడ బస చేస్తారు. రామాలయ ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానం పొందిన ప్రముఖులు:

వ్యాపారవేత్తలకు ఆహ్వానం

  • 1. కె సతీష్ రెడ్డి(డాక్టర్ రెడ్డీస్ ఫార్మాస్యూటికల్స్‌)
  • 2. పునీత్ గోయెంకా (జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ సీఈఓ)
  • 3. ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ (ఎల్‌అండ్‌టీ సిఈఓ)
  • 4. మురళీ దివి( దివీస్ లేబొరేటరీస్‌)
  • 5. నారాయణ మూర్తి(ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు)
  • 6. నవీన్ జిందాల్( వ్యాపారవేత్త)

సినీ ప్రముఖులకు ఆహ్వానం

  • 1. మెగాస్టార్ చిరంజీవి(టాలీవుడ్​ హీరో)
  • 2. అల్లు అర్జున్​(టాలీవుడ్ హీరో)
  • 3.అజయ్ దేవగణ్​(బాలీవుడ్ హీరో)
  • 4. అక్షయ్ కుమార్​(బాలీవుడ్ హీరో)
  • 5. అనుపమ్ ఖేర్(బాలీవుడ్ నటుడు)
  • 6.​మోహన్​లాల్​(మలయాళ నటుడు)
  • 7. అమ్జద్ అలీ(సంగీత కళాకారుడు)
  • 8. మనోజ్ ముంతాషీర్​(రచయిత)
  • 9. ప్రసూన్ జోషి(రచయిత)
  • 10. సంజయ్ భన్సాలీ(దర్శకుడు)
  • 11. చంద్రప్రకాశ్ ద్వివేది(దర్శకుడు)

మాజీ స్పీకర్​కు ఆహ్వానం

  • మీరా కుమార్(లోక్‌సభ మాజీ స్పీకర్)
  • మాంటెక్ సింగ్ అహ్లూవాలియా(ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ చైర్మన్)
  • అమితాబ్ కాంత్(భారత జీ20 షెర్పా)
  • అమర్ సిన్హా( మాజీ దౌత్యవేత్త)
  • కెకె వేణుగోపాల్( మాజీ అటార్నీ జనరల్‌)
  • ముకుల్ రోహత్గి( మాజీ అటార్నీ జనరల్‌)
  • మిథాలీ రాజ్‌(భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్)

Last Updated : Jan 19, 2024, 5:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.