ETV Bharat / bharat

ఆటో డ్రైవర్​కు రూ.56 వేల కరెంటు బిల్లు - భారీగా విద్యుత్​ బిల్లులు

మహారాష్ట్రలోని హేర్​గావ్​కు చెందిన ఓ ఆటోడ్రైవర్​కు రూ.56వేల కరెంటు బిల్లు వచ్చింది. బిల్లును చూసి విస్తుపోయిన అతను విద్యుత్​ శాఖకు ఫిర్యాదు చేశాడు. గతేడాది నవంబరులో కూడా అతనికి ఈ తరహా అనుభవం ఎదురవడం గమనార్హం.

auto driver
బిల్లుతో ఆటోడ్రైవర్​కు 'షాక్'
author img

By

Published : Mar 5, 2021, 8:39 AM IST

ఆటోడ్రైవర్​గా బతుకు బండిని నడిపిస్తున్న అతనికి విద్యుత్​ సంస్థ షాక్​ ఇచ్చింది. ఫిబ్రవరి నెల కరెంటు బిల్లు చూసి అతను నోరెళ్లబెట్టాడు. వెయ్యి, రెండు వేలు కాదు ఏకంగా 56వేల రూపాయలు చెల్లించమంటూ బిల్లులో ఉంది. ఈ ఘటన మహారాష్ట్రలోని లాతుర్​ జిల్లా హేర్​గావ్​లో జరిగింది.

హేర్​గావ్​లో కుటుంబంతో నివసిస్తున్న దస్తగీర్​ షేక్ ఆటోడ్రైవర్​గా జీవనం సాగిస్తున్నాడు. అతని ఇంట్లో కేవలం ఒక ఫ్యాన్​, టీవీ, రెండు ఆరు వాట్ల బల్బులు ఉన్నాయి. ప్రతినెల సగటున రూ.800 నుంచి రూ.1000 మధ్య బిల్లు వచ్చేది. కానీ గత నెల మాత్రం రూ.56వేలు వచ్చింది. అయితే దస్తగీర్​కి విద్యుత్​ సంస్థ ఇలా షాకివ్వడం తొలిసారి కాదు. గతేడాది నవంబరులోనూ ఇలాగే భారీగా బిల్లు వేశారు. 17వేల రూపాయలు చెల్లించాలని బిల్లులో పేర్కొన్నారు. దీనిపై దస్తగీర్​​ విద్యుత్​ శాఖకు కూడా ఫిర్యాదు చేశాడు. అది పరిష్కారం అయ్యేలోపే మరోసారి ఇలా బిల్లు రావడం గమనార్హం.

ఈ ఘటనపై విద్యుత్​ శాఖ స్పందించింది. మీటరులో సమస్యలు తలెత్తడం వల్ల ఈ తరహా ఘటనలు జరిగే అవకాశం ఉంటుందని వివరణ ఇచ్చింది. ​

ఇదీ చదవండి : మమత కోసం శివసేన కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.