ETV Bharat / bharat

ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. చేతిని కొరికి తప్పించుకున్న చిన్నారి - బాలిక పై అత్యాచారంయత్నం

ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఓ ఎనిమిదేళ్ల బాలికపై కన్నేశాడు ఓ కామాంధుడు. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకువెళ్లి అఘాయిత్యానికి ప్రయత్నించాడు. చాకచక్యంగా వ్యవహరించిన ఆ బాలిక అతడి చేతిపై కొరికి అక్కడ నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడ్ని అరెస్ట్​ చేశారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్​లో జరిగింది.

ape_attemp
ape_attemp
author img

By

Published : Jun 18, 2022, 4:15 PM IST

Rape Attempt On Minor: రాజస్థాన్​లోని​ జైపుర్​లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ఓ ఎనిమిదేళ్ల బాలికను ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. దీంతో ఆమె ఒక్కసారిగా ధైర్యం తెచ్చుకుని.. నిందితుడి చేతిపై గట్టిగా కొరికి ఆ కిరాతకుడి బారి నుంచి తప్పించుకుంది. ఫిర్యాదు అందుకున్న ప్రతాప్​నగర్​ పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్​ చేసి కేసు నమోదు చేశారు.

ape_attemp
నిందితుడు గోవర్ధన్​

పోలీసులు వివరాల ప్రకారం.. శుక్రవారం బాధిత బాలిక తన ఇంటి బయట ఆడుకుంటుండగా.. ఆ ప్రాంతంలోనే నివసించే గోవర్ధన్​ అనే వ్యక్తి ఆమెను మభ్యపెట్టి తనతోపాటు నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆమెను బలవంతంగా వివస్త్రను చేసి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో బాలిక గట్టిగా కేకలు వేసింది. అసభ్యకరమైన పనులు చేస్తున్న నిందితుడి చేతిపై గట్టిగా కొరికింది. ఆ దెబ్బ నుంచి నిందితుడు కోలుకునేలోపు.. బాలిక అక్కడ నుంచి పారిపోయి తన ఇంటికి చేరుకుంది. జరిగినదంతా తన కుటుంబసభ్యులకు తెలియజేసింది.

ఒక్కసారిగా ఉలిక్కిపడిన కుటుంబసభ్యులు.. నిందితుడి కోసం చాలా చోట్ల గాలించారు. కానీ అతడు దొరకలేదు. దీంతో వెంటనే బాలిక కుటుంబసభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు.. కొన్ని గంటల్లోనే నిందితుడు గోవర్ధన్​ను అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జైపుర్‌లో గత ఐదు రోజుల వ్యవధిలో మూడు అత్యాచారయత్న ఘటనలు వెలుగుచూశాయి.

ఇవీ చదవండి: ప్రియురాలు, ఆమె సోదరుడిని సుత్తితో కొట్టి చంపిన బాయ్​ఫ్రెండ్​!

'అగ్నిపథ్​' నిరసనలతో ఆగిన ట్రైన్​​​.. వ్యక్తి మృతి.. రైలులోనే మహిళ ప్రసవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.