ETV Bharat / bharat

ర్యాగింగ్​కు భయపడి బిల్డింగ్​ పైనుంచి దూకిన విద్యార్థి.. తీవ్ర గాయాలతో.. - Stone pelting at running train

ర్యాగింగ్​కు భయపడిన ఓ విద్యార్థి రెండంతస్తుల భవనంపై నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అసోంలో వెలుగుచూసింది. దీనిపై స్పందించిన యూనివర్సిటీ యంత్రాంగం.. 18 మందిని సస్పెండ్​ చేసింది. మరో ఘటనలో కొందరు ఆకతాయిలు రన్నింగ్​ ట్రైన్​పై రాళ్ల దాడికి పాల్పడ్డారు.

assam student ragging
రెండంతస్తులు భవనంపై నుంచి దూకిన విద్యార్థి
author img

By

Published : Nov 28, 2022, 6:17 PM IST

Updated : Nov 28, 2022, 7:21 PM IST

అసోంలో ఓ ప్రైవేట్​ యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతం​ ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. సీనియర్​ విద్యార్థులు చేసే ర్యాగింగ్​ నుంచి తప్పించుకోవడానికి ఓ జూనియర్​ రెండంతస్తుల హాస్టల్​ భవనంపై నుంచి దూకాడు. దీంతో అతడికి తీవ్రంగా గాయాలయ్యాయి. గత నాలుగు నెలలుగా సీనియర్​ విద్యార్థులు తమ కుమారుడ్ని చిత్రహింసలకు గురిచేసి.. చంపడానికి ప్రయత్నించినట్లు బాధితుడి తల్లి ఆరోపించింది. దీనిపై యూనివర్సిటీ యాజమాన్యం స్పందించి ర్యాగింగ్​కు పాల్పడిన 18 మంది సీనియర్ విద్యార్థులను వెంటనే సస్పెండ్​ చేసింది. ఈ ఘటనపై సీఎం హిమంత బిశ్వశర్మ కూడా స్పందించారు.

గువాహటిలోని దిబ్రూగఢ్​​ యూనివర్సిటీలో ఆనంద్​ శర్మ అనే ఓ జూనియర్​ విద్యార్థి రెండంతస్తుల హాస్టల్ భవనం​పై నుంచి దూకాడు. నవంబర్​ 26 రాత్రి యూనివర్సిటీ బాయ్స్​ హాస్టల్​​లో కొందరు సీనియర్​లు ఆనంద్​ను తీవ్రంగా కొట్టగా.. వారినుంచి తప్పించుకోవడానికి​ ఇలా చేయాల్సి వచ్చింది. దీంతో అతడికి తీవ్రంగా గాయలయ్యాయి. వెంటనే గాయపడిన ఆనంద్​ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గత నాలుగు నెలలుగా డిగ్రీ ఫస్ట్​ ఇయర్​ చదివే తమ కుమారుడ్ని కొందరు సీనియర్​ విద్యార్థులు చిత్రహింసలకు గురిచేసి.. హత్య చేయడానికి ప్రయత్నించారని బాధితుడి తల్లి సరిత ఆరోపించారు. ఈ దారుణానికి కారణమైన విద్యార్థులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కొందరు స్టూడెంట్స్​ డిమాండ్​ చేశారు. ఈ ఘటనపై స్పందించిన యూనివర్సిటీ యాజమాన్యం దీనితో సంబంధం ఉన్న.. 18 మంది సీనియర్​ విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్​ చేసి.. వెంటనే వారి హాస్టల్ ​గుర్తింపును కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. వారిలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్​ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై అసోం సీఎం హిమంత బిశ్వశర్మ స్పందించి ఓ ట్వీట్​​ చేశారు.

'దిబ్రూగఢ్​ యూనివర్సిటీలో ర్యాగింగ్​ జరిగి.. ఓ విద్యార్థి గాయపడినట్లు తెలిసింది. దీనిపై వెంటనే జిల్లా యంత్రాంగంతో మాట్లాడాను.. వారు నిందితులపై చర్యలు తీసుకుంటారు. పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం బాధితుడికి అత్యవసర వైద్యసేవలు అందిస్తున్నాం. విద్యార్థులంతా ర్యాగింగ్​కు నో చెప్పాలని నా విజ్ఞప్తి.'
-- హిమంత బిశ్వశర్మ, అసోం ముఖ్యమంత్రి

రన్నింగ్​ ట్రైన్​పై రాళ్లు రువ్విన ఆకతాయిలు..
మహారాష్ట్రలో​ కొందరు ఆకతాయిలు రన్నింగ్​ ట్రైన్​పై రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఓ మహిళా ప్రయాణికురాలు గాయపడింది. సోమవారం ఉదయం ఆంబివలీ రైల్వే స్టేషన్​ సమీపంలో ఈ దాడి జరిగింది. కొంతమంది ఆకతాయిలు కల్యాణ్​-కాసర రైల్వే లైన్‌లో వెళ్తున్న ఓ ఎక్స్​ప్రెస్​పై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో దివా ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల రఖ్మాహబాయి పాటిల్​ అనే మహిళ కంటికి గాయమైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. గతంలోనూ అదే ప్రాంతంలో.. ఇలాంటి ఘటనే జరిగినట్లు తెలిపారు.

Last Updated : Nov 28, 2022, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.