ETV Bharat / bharat

Assam Road Accident : మార్కెట్​కు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. ఏడుగురు మృతి.. 12 మందికి గాయాలు.. - అసోం రోడ్డు ప్రమాదాల్లో మరణాల శాతం

Assam Road Accident : ట్రక్కు- టాటా మ్యాజిక్ ఢీ కొన్న ఈ ఘటనలో ఏడుగురు మరణించగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అసోం తింసుకియా జిల్లాలో జరిగింది.

Assam Road Accident
Assam Road Accident
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 6, 2023, 7:38 AM IST

Updated : Sep 6, 2023, 11:18 AM IST

Assam Road Accident : అసోం తింసుకియా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ట్రక్కు- టాటా మ్యాజిక్ ఢీ కొన్న ఈ ఘటనలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తింసుకియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని అక్కడి నుంచి.. రాత్రికి రాత్రే దిబ్రూగఢ్​లోని అసోం మెడికల్ కాలేజ్​కు తీసుకెళ్లారు.

ఇదీ జరిగింది..
ధీరక్ సొంజన్ గ్రామానికి చెందిన కొంత మంది.. మంగళవారం జిల్లాలోని దుందుమ వారాంతపు మార్కెట్​కు వెళ్లారు. వీరంతా తిరిగి ఇంటికి వస్తుండగా.. అరుణాచల్ ప్రదేశ్ నుంచి వస్తున్న ట్రక్కు.. వీరు ప్రయాణిస్తున్న టాటా మ్యాజిక్​ను పత్తార్​ సమీపంలో రాత్రి 10.30 గంటల సమయంలో ఢీకొట్టింది. ట్రక్కు డ్రైవర్ అతిగా మద్యం సేవించి వాహనం నడపడమే.. ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. అయితే ఈ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని.. అధికారులు వెంటనే స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని స్థానికులు వాపోయారు. కాగా మృతి చెందిన వారిని బింతియా, బరుహా, రీనా గొగోయ్, మిహిధర్ నియోగ్, పబేన్ మారన్, కులాయ్ మెష్, పల్లవి దహోతియాగా గుర్తించారు. గాయపడిన వారిని అతుల్ గొగోయ్, భురంజిత్ మారన్, జొనాలి మారన్, బికాశ్ నియోగ్, గోలేశ్వర్ మారన్, మోనో మారన్, యశోద మారన్, లక్ష్మిమణి మారన్, ఎలిటా మారన్​, పింకి మారన్​గా అధికారులు గుర్తించారు.

ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి
Tamil Nadu Road Accident : తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. వీరు ప్రయాణిస్తున్న మినీ వ్యాన్​ వేగంగా వచ్చి రోడ్డు పక్కన ఆపిన ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో వ్యాన్​లోని ఆరుగురు మృతిచెందారు. ఈ ప్రమాదం సేలం-కోయంబత్తూర్​ జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారని సమీపంలోని సేలం ప్రభుత్వ మెడికల్​ కాలేజీకి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్​ పరీక్షల కోసం పంపించారు.

  • VIDEO | Six members of a family killed after a minivan crashed into a truck on Salem-Coimbatore National Highway in Tamil Nadu earlier today. More details awaited. pic.twitter.com/UlbmX3BCNR

    — Press Trust of India (@PTI_News) September 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Car Accident in Dhone: మద్యం మత్తులో బైక్​లను ఢీకొట్టి.. బీభత్సం సృష్టించిన కారు.. సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలు

ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ఇంజినీరింగ్​ విద్యార్థులు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం

Last Updated : Sep 6, 2023, 11:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.