ETV Bharat / bharat

అలా పెళ్లి చేసుకున్నారని వేల మంది అరెస్ట్.. వారి కుటుంబసభ్యుల బాధ వర్ణనాతీతం

బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపిన అసోం ప్రభుత్వం ఇటీవల 3 వేల మందిని అరెస్టు చేసింది. అరెస్టైన వారిలో చాలా మంది నిందితులు ఆయా కుటుంబాలకు వారే పెద్ద దిక్కు కావడం వల్ల కుటుంబ సభ్యుల పరిస్థితి దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ నేపథ్యంలో అరెస్టులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2026 నాటికి అసోంలో బాల్య వివాహాలు నిర్మూలిస్తామని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.

assam child marriage case
అసోం బాల్య వివాహాలు
author img

By

Published : Feb 17, 2023, 7:23 PM IST

assam child marriage case
పోలీస్ స్టేషన్​ వద్ద నురేజా ఖాతూన్

చేతిలో ఆరు నెలల పసిపాప.. పోలీస్ స్టేషన్​ ఎదుట దీనంగా నిల్చుని ఉన్న ఈమె పేరు నురేజా ఖాతూన్. తమ ఇంటికి ఆధారమైన భర్త అరెస్టు కావడం వల్ల ఆమె ఇలా స్టేషన్​ బయట ఎదురు చూస్తుంది. ప్రస్తుతం అసోంలో ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. బాల్య వివాహాలపై ఉక్కుపాదం మోపుతున్న అసోం ప్రభుత్వం బాల్య వివాహాలు చేసుకున్న దాదాపు 3వేల మందిని అరెస్టు చేసింది. ఈ నిర్ణయం వారి కుటుంబాలను వేదనకు గురిచేస్తుంది. తమ కుటుంబాలకు జీవనాధారమైన వారిని అరెస్టు చేయడం వల్ల వారి పరిస్థితి దిక్కుతోచని స్థితిలో పడింది. అమ్మాయిల భవిష్యత్తు ప్రమాదంలో పడింది.

assam child marriage case
నురేజా ఖాతూన్ భర్తను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
Assam child marriage arrests
పోలీస్ స్టేషన్​లో నురేజా ఖాతూన్

బాల్య వివాహాలు జరిగిన వాళ్లలో చాలా మంది నిరక్ష్యరాసులు కనీసం వారికి చట్టాలు అంటే కూడా తెలియదు. చాలా మంది ఉపాధి లేనివారు, భర్తపైనే ఆధారపడి బతుకుతున్నవారు. బెయిల్‌కు కూడా తమ వద్ద డబ్బులు లేవని బాధితులు వాపోతున్నారు. సంపాదించే భర్త లేకపోవడం వల్ల పూట గడవడం కష్టంగా మారిందని నురేజా ఖాటూన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 'ఇప్పుడు మాకు తిండి పెట్టడానికి ఎవరూ లేరు. నా కుటుంబం బతకగలదో లేదో నాకు తెలియదు. పూట గడవడం కూడా కష్టంగా ఉంది.' అని నురేజా ఖాటూన్ బాధపడుతున్నారు.

నేను బెయిల్‌ కోసం న్యాయవాదిని కలిశాను. నా దగ్గర డబ్బులు లేవని చెప్పడం బాధగా ఉంది. నా దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి. ఏమి చేయాలో నాకు తెలియదు. ఇంట్లో డబ్బు లేదు. నేను రోజువారీ కూలీ ఎలా చేయగలను.

-రాధా రాణి మోండల్

అసోంలో బాల్య వివాహాలు ఏటా పెరిగిపోతున్నాయి. వీటిలో చాలా వరకు కేసులు నమోదం కావడం లేదు. అసోంలో 2021లో 155, 2020లో 138 బాల్య వివాహాల కేసులు మాత్రమే నమోదయ్యాయిని జాతీయ నేర గణాంకాల సంస్థ తెలిపింది. ఏటా భారతదేశంలో 15 లక్షల పైగా బాల్య వివాహాలు జరుగుతున్నాయిని యూనిసెఫ్‌ నివేదించింది. బాల్య వివాహాల్లో ప్రపంచంలో భారత్‌ది అగ్రస్థానం అని వెల్లడించింది. పేదరికం, విద్య లేకపోవడం సామాజిక వెనుకబాటుతనం వీటికి కారణాలని తెలిపింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొంది.

Assam child marriage arrests
రోదిస్తున్న మహిళ

అసోంలోని కొన్ని జిల్లాల్లో యుక్త వయసులో గర్భం దాల్చే అమ్మాయిల సంఖ్య 26 శాతం పెరిగిందని అసోం అదనపు డీజీపీ ఏవై కృష్ణ తెలిపారు. 2026 సంవత్సరం నాటికి బాల్యవివాహాలను నిర్మూలించాలని అసోం ప్రభుత్వం తీర్మానం చేసిందని ఏవై కృష్ణ చెప్పారు.

బాల్య వివాహాలు పెరిగిపోవడం, టీనేజీ ప్రెగ్నెన్సీ పెరిగిపోవడం ఫలితంగా మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. అసోం ప్రభుత్వం ఈ బాల్య వివాహాలను నిర్మూలించాలని నిర్ణయించింది. పోక్సో చట్టం 2012లో అమలులోకి వచ్చింది. బాల్య వివాహాల నిరోధక చట్టం 2006లో వచ్చింది. 2006 తర్వాత ఎవరైనా బాల్య వివాహాం చేసుకుంటే ఈ చట్టం కింద కేసు నమోదు చేస్తారు. మైనర్‌ మీద ఎవరైనా లైంగిక చర్యకు పాల్పడితే 2012 పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తాం. నేరం జరిగిన సమయంలో చట్టం వర్తిస్తుంది. 2023కి ముందు జరిగిన నేరాల్లో కూడా ఈ చట్టం వర్తిస్తుంది.

--ఏవై కృష్ణ, అసోం అదనపు డీజీపీ

బాల్య వివాహాలను నిర్మూలించాలంటే సామూహిక అరెస్టుల పరిష్కారం కాదని సామాజిక సంస్కరణలపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని సామాజిక వేత్తలు అంటున్నారు. ఇటీవల బాల్య వివాహాల కేసులో అరెస్టుల చేసిన తీరుపై గువాహటి హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాల్య వివాహాలు చేసుకున్న వారిపై పోక్సో చట్టం కింద అభియోగాలు మోపడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది.

Assam child marriage arrests
భర్త అరెస్టయిన బాధలో మహిళ
Assam child marriage arrests
అరెస్టయిన వ్యక్తి ఫొటోతో కుటుంబసభ్యురాలు
Assam child marriage arrests
బాధిత కుటుంబం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.