First wife sets House on Fire: భర్త రెండో వివాహం పట్ల ఆగ్రహంగా ఉన్న ఓ మహిళ ఏకంగా ఇంటికే తగలబెట్టింది. ఈ ఘటనలో కుటుంబంలోని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. బిహార్‌లోని ధర్భంగా జిల్లాలో శనివారం ఈ దారుణం జరిగింది.
ఇదీ జరిగింది: సుపౌల్ బాజార్‌కు చెందిన 40 ఏళ్ల ఖుర్షీద్ ఆలం.. పదేళ్ల క్రితం బీబీ పర్వీన్‌ను (35) వివాహం చేసుకున్నాడు. వారికి పిల్లలు లేరు. పిల్లల కోసం రెండేళ్ల కిందట సమీప గ్రామానికి చెందిన రోష్మి ఖతూన్‌ను పెళ్లి చేసుకున్నాడు ఖుర్షీద్. అయితే ఈ వివాహం పట్ల మొదటి భార్య పర్వీన్ సంతృప్తిగా లేదు. తీవ్ర పరిణామాలుంటాయని భర్తను తరచూ బెదిరిస్తూ ఉండేది.
ఈ క్రమంలోనే శనివారం ఉదయం 5 గంటల సమయంలో పెట్రోల్ పోసి ఇంటికి నిప్పంటించింది బీబీ పర్వీన్. ఈ ఘటనలో పర్వీన్, ఆమె 65 ఏళ్ల అత్త రుఫైదా ఖతూన్ కాలి బూడిదయ్యారు. రోష్మి ఖతూన్, ఖుర్షీద్‌ను తొలుత సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తీసుకెళ్లి, అక్కడినుంచి ధర్భంగా మెడికల్ కాలేజ్, హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వారు చికిత్స పొందుతూ మరణించారు. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి: అమృత్సర్ గురునానక్ దేవ్ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం