కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా(మోను)(Ashish mishra bjp) కారు రైతులపైనుంచి(Farmers protest news) దూసుకెళ్లినట్లు ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఉంది. ఆ సమయంలో మిశ్రా.. కారులోనే ఉన్నారని రైతులపై ఆశిష్ కాల్పులు జరిపినట్లు ఎఫ్ఐఆర్లో నమోదైంది. బహ్రెయిచ్ జిల్లాకు చెందిన జగ్జీత్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
" కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా, అతని కుమారుడు ఆశిష్ మిశ్రా.. పథకం ప్రకారమే రైతులపై దాడి చేశారు. అజయ్ మిశ్రా.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం వల్లే.. రైతులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రైతులు నల్లబ్యాడ్జీలతో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు మహారాజా అగ్రసేన్ ఇంటర్ కాలేజీ గ్రౌండ్‌కు వచ్చారు. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆశిష్ మిశ్రా.. 15-20 మందితో మూడు కార్లలో బన్బిర్పుర్లోని నిరసన ప్రదేశానికి వచ్చారు. ఆశిష్ మిశ్రా రైతులపై కాల్పులు జరిపారు. "
-- ఎఫ్ఐఆర్ ప్రకారం
అయితే.. తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని(lakhimpur violence news), దర్యాప్తు సంస్థల ఎదుట హాజరయ్యేందుకు సిద్ధమని.. లఖింపుర్ హింసాత్మక ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రా వెల్లడించారు.
ఇదీ జరిగింది..
ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో(Lakhimpur kheri news) ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన నేపథ్యంలో ఆదివారం ఆ ప్రాంతంలో హింస చెలరేగింది. లఖింపుర్ ఖేరీ జిల్లా టికునియా- బన్బీర్‌పుర్ సరిహద్దు వద్ద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులు, అధికార వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.
తమపై మంత్రుల కాన్వాయ్ దూసుకెళ్లిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం నలుగురు రైతులు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: ఉద్రిక్తతల మధ్య లఖింపుర్‌కు రాహుల్ గాంధీ!