ETV Bharat / bharat

'బుల్లెట్లనైనా ఎదుర్కొంటా.. జడ్​ కేటగిరీ భద్రత నాకొద్దు' - up election 2022

asaduddin owaisi
జడ్ కేటగిరీ భద్రత తిరస్కరించిన ఒవైసీ!
author img

By

Published : Feb 4, 2022, 5:15 PM IST

Updated : Feb 4, 2022, 5:52 PM IST

17:11 February 04

'బుల్లెట్లనైనా ఎదుర్కొంటా.. జడ్​ కేటగిరీ భద్రత నాకొద్దు'

Asaduddin Owaisi Rejects Z Category: తనకు జడ్​ కేటగిరీ భద్రత వద్దని చెప్పారు హైదరాబాద్​ ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఒవైసీ. దీనికి బదులుగా దేశంలో మతసామరస్యాన్ని పునరుద్ధరించాలని లోక్​సభ స్పీకర్ ఓంబిర్లాను అడిగారు. ​ కాల్పులు జరిపిన వారిని చూసి భయపడట్లేదని అన్నారు. యూపీ ఎన్నికల ప్రచారం సమయంలో గురువారం.. ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో.. ఆయనకు జడ్​ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించగా దానిని ఒవైసీ తిరస్కరించారు.

''నాకు జడ్​ కేటగిరీ భద్రత అవసరం లేదు. నాపై కాల్పులు జరిపితే.. నేను ఆ బుల్లెట్లను స్వీకరిస్తా. దేశంలో పేదలు బతికితేనే నేనూ బతుకుతాను. బదులుగా ఈ విద్వేషవ్యాప్తిని ఆపమని మిమ్మల్ని వేడుకుంటున్నా.''

- అసదుద్దీన్​ ఒవైసీ, ఎంపీ

ఇలా జరిగినంత మాత్రాన.. తన ట్రాక్​ నుంచి పక్కకు తప్పుకోనని, ఉత్తర్​ప్రదేశ్​ ప్రజలే బ్యాలెట్​ ద్వారా వారికి తగిన సమాధానం చెప్తారని అన్నారు.

అసదుద్దీన్​ ఒవైసీ కాల్పుల ఘటనపై ఫిబ్రవరి 7న పార్లమెంటులో సమగ్ర వివరణ ఇవ్వనున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.

ఇవీ చూడండి: అసదుద్దీన్​ ఒవైసీ కారుపై దాడి- తుపాకులతో దుండగుల బీభత్సం!

కేంద్రం కీలక నిర్ణయం- 'ఒవైసీ'కి జెడ్​ కేటగిరీ భద్రత!

Last Updated : Feb 4, 2022, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.