ETV Bharat / bharat

'కశ్మీర్ ప్రజలంతా కోరుకున్నా ఆర్టికల్ 370ని రద్దు చేయలేరా? ఇదేం నిబంధన?' - ఆర్టికల్ 370 సుప్రీం కోర్టువిచారణ

Article 370 Supreme Court Hearing : ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై గురువారం సైతం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జమ్ము కశ్మీర్ రాజ్యాంగ సభ మనుగడలో లేదు కాబట్టి ఆర్టికల్ 370 శాశ్వతత్వం పొందిందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాజ్యాంగ సవరణను మించిన నిబంధన రాజ్యాంగంలో ఎలా ఉంటుందని వ్యాఖ్యానించింది.

Article 370 Supreme Court Hearing
Article 370 Supreme Court Hearing
author img

By

Published : Aug 3, 2023, 9:56 PM IST

Article 370 Supreme Court Hearing : జమ్ము కశ్మీర్ ప్రజలంతా కోరుకున్నా ఆర్టికల్-370 రద్దు చేసేందుకు ఎలాంటి వ్యవస్థే లేదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై రెండోరోజు విచారణ జరిపిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం.. ఆ అధికరణాన్ని ముట్టుకునే అవకాశమే లేకపోతే.. రాజ్యాంగ ప్రాథమిక నిర్మానానికి (బేసిక్ స్ట్రక్చర్) మించిన ఓ కేటగిరీని తయారు చేసినట్టు అవుతుంది కదా అని వ్యాఖ్యానించింది. 'జమ్ము కశ్మీర్ రాజ్యాంగ సభ రద్దుతో ఆర్టికల్-370 శాశ్వతత్వం పొందిందా? ఆ ఆర్టికల్ రద్దు చేయడానికి పాటించిన ప్రక్రియ సరైనదేనా అనే ప్రశ్నలు మాత్రమే ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయ'ని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్​తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో సీజేఐతో పాటు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్​లు ఉన్నారు.

నేషనల్ కాన్ఫరెన్స్ నేత మహ్మద్ అక్బర్ లోనే తరఫున హాజరైన సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబల్.. రెండో రోజూ తన వాదనలు వినిపించారు. రాజ్యాంగ రచయితలకు, జమ్ము కశ్మీర్ నాటి మహరాజు హరిసింగ్​కు అప్పట్లో ఓ అంగీకారం కుదిరిందని గుర్తు చేశారు. పాకిస్థాన్​ చొరబాటుదారుల సమస్య నేపథ్యంలో కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తికి మద్దతుగా భారత్​తో విలీన ఒప్పందం చేసుకున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో చేర్చారని గుర్తు చేశారు. దాన్ని రద్దు చేసేందుకు ఎలాంటి ప్రక్రియను అనుసరించలేమని కపిల్ సిబల్ వాదించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది.

"రాజ్యాంగం అనేది సజీవ పత్రం. మార్చడానికి వీలులేనిది కాదు. అందరూ మార్చాలని కోరుకున్నా.. దాన్ని మార్చే అవకాశమే లేదని మీరు అంటున్నారా? మొత్తం కశ్మీర్ ప్రజలు కోరుకున్నా.. దీన్ని (ఆర్టికల్ 370 రద్దు) చేపట్టే అవకాశం లేదని అంటున్నారు" అని జస్టిస్ కిషన్ కౌల్ పేర్కొన్నారు. "రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 ప్రకారం ఉన్న అధికారాలతో ఆర్టికల్-370ని మార్చేసే లేదా రద్దు చేసే హక్కు పార్లమెంట్​కు లేదా? అంటే.. రాజ్యాంగ సవరణను మించిన నిబంధన రాజ్యాంగంలో ఉందని మీరు అంటున్నారు. మీ వాదనలు పరిగణలోకి తీసుకుంటే.. రాజ్యాంగ మౌలిక స్వరూపం కాకుండా మరో కొత్త కేటగిరీని సృష్టించినట్లు అవుతుంది" అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.

రాజ్యాంగ సభ మనుగడలో లేనందున ఆర్టికల్ 370 శాశ్వతత్వం పొందిందని సిబల్ తన వాదనను కొనసాగించారు. శాసన సభలో ఆర్టికల్ 370 రద్దు లేదా సవరణ కోసం ఎలాంటి బిల్లులు ప్రవేశపెట్టరాదని జమ్ము కశ్మీర్ రాజ్యాంగంలో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్టికల్ 370 రద్దు అంశం రాజకీయ ప్రక్రియలో భాగంగా జరిగిందని, రాజ్యాంగబద్ధంగా దీన్ని నిర్వహించాల్సిందని అన్నారు. దీనిపై వాదనలు ఆగస్టు 8న కొనసాగనున్నాయి. బుధవారం జరిగిన వాదనలకు సంబంధించిన వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.