ETV Bharat / bharat

Andhra Pradesh Three Capitals Issue: రాజధానిని మారుస్తూ అవస్థలు పడ్డా కశ్మీరును చూసి నేర్చుకోండి.. సీఎం సారూ.. - ఏపీ రాజధాని వార్త

Andhra Pradesh Three Capitals Issue: ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి మూడు రాజధానులపై ఇంకా కళ్లు తెరవటం లేదు. కశ్మీర్​ను చూసైనా వైసీపీ ప్రభుత్వం తీరు మారటం లేదు. ఆరునెలలు జమ్మూలో మరో 6నెలలు కశ్మీర్​ రాజధాని ఉంటే.. లాభం లేదని 149 ఏళ్ల దర్బార్‌ మూవ్‌ సంప్రదాయానికే స్వస్తి పలికారు. తుగ్లక్ 1327లో దిల్లీ నుంచి దౌలతాబాద్‌కు రాజధానిని మార్చగా.. వేలాదిమంది ప్రజలు ఆకలిదప్పులతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు జగన్‌ చర్యను కూడా ప్రముఖులు పిచ్చితుగ్లక్‌తో పోల్చుతున్నారు.

Andhra_Pradesh_Three_Capitals_Issue
Andhra_Pradesh_Three_Capitals_Issue
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 9:20 AM IST

Andhra Pradesh Three Capitals Issue: రాజధానిని మారుస్తూ అవస్థలు పడ్డా కశ్మీరును చూసి నేర్చుకోండీ.. సీఎం సారూ..

Andhra Pradesh Three Capitals Issue: తెగల మధ్య ఆధిపత్య పోరు, రాజకీయ, సాంస్కృతిక కారణాలతో దశాబ్దాల క్రితం మూడు రాజధానులు ఏర్పాటు చేసుకున్న దక్షిణాఫ్రికా.. వాటి నిర్వహణ భారమై ఇప్పుడు తల పట్టుకుంటోంది. ‘దర్బార్‌ మూవ్‌’ పేరుతో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని జమ్మూ-శ్రీనగర్‌ మధ్య తరలించే విధానం ఎంత అనవసర ప్రక్రియో గుర్తించి అక్కడి ప్రభుత్వం ఇటీవలే ముగింపు పలికింది.

ఇలా ప్రపంచమంతా కాలం చెల్లిన విధానాలను వదిలించుకుంటుంటే.. జగన్ మాత్రం ఇంకా వాటినే పట్టుకుని వేలాడుతున్నారు. అమరావతి నాశనమే ఏకైక లక్ష్యంగా మూడు రాజధానుల పాటపాడిన వైసీపీ ప్రభుత్వం.. హైకోర్టు మొట్టికాయలతో ఇప్పుడు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ముసుగులో రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తోంది.

ఈ నాలుగున్నరేళ్ల పాలనలో.. ఉత్తరాంధ్రకు వైసీపీ ప్రభుత్వం ఏం మేలు చేసింది?

ఎప్పుడెప్పుడు విశాఖకు తరలిపోదామా అని సీఎం జగన్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయం పేరిట 270 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేశారు. ఇక మంత్రులు, శాఖాధిపతుల కార్యాలయాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయబోతున్నారు. సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చినా.. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆదేశించినా.. ప్రభుత్వ కార్యాలయాలు తరలించేందుకు వీలులేదని తేల్చి చెప్పినా.. ఇప్పుడు పెడుతున్న ఖర్చంతా వృథానే. ఎవరికి వాళ్లు అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధానులు మార్చుకుంటూ పోతే రాష్ట్ర భవిష్యత్తు ఏమవుతుంది? ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వానికి జవాబుదారీతనం, బాధ్యత ఉండాలి. పాలకులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి పాలన సాగించాలి.

రాజధానులను మార్చడం ద్వారా ఎంత నష్టమో కశ్మీరే మంచి ఉదాహరణ. కశ్మీర్‌ రాజు మహారాజా రణబీర్‌సింగ్‌ 1872లో వేసవి కాలం మే నుంచి అక్టోబరు వరకు శ్రీనగర్‌ను రాజధానిగా, అక్కడ చలి తీవ్రంగా ఉండే నవంబరు - ఏప్రిల్‌ మధ్య జమ్మూను రాజధానిగా చేసుకుని పాలించేవారు. భౌగోళిక, వాతావరణ పరిస్థితులతోపాటు, అప్పటికి రహదారులు, రవాణా, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు అభివృద్ధి చెందని కాలంలో ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నారు.

Central Govt Dilemma on AP three Capitals concept జగన్ సర్కార్ మూడు రాజధానుల డ్రామా..! నాలుగేళ్లుగా ఏర్పాటు కాని కేంద్ర సంస్థలు..

అప్పటి నుంచి ఏటా ప్రభుత్వ యంత్రాంగమంతా ఆరు నెలలు శ్రీనగర్‌లో కొలువుతీరితే, మరో ఆరు నెలలు జమ్మూలో కొలువయ్యేది! ‘దర్బార్‌ మూవ్‌’ పేరుతో 2021 వరకు 149 ఏళ్లపాటు ఈ సంప్రదాయం కొనసాగింది. ఏటా సుమారు 10 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఆరు నెలలకు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మకాం మారేవారు. దీనికి ఏటా 200 కోట్లు ఖర్చయ్యేది.

ప్రభుత్వానికి సంబంధించిన దస్త్రాల్ని వేలకొద్దీ అట్టపెట్టెలు, ట్రంక్‌పెట్టెల్లో పెట్టి, కట్టలు కట్టి.. సుమారు 250-300 ట్రక్కుల్లో పంపించేవారు. దస్త్రాలు, రికార్డులతో ట్రక్కులు బయల్దేరినప్పటి నుంచి గమ్యం చేరే వరకు పోలీసులతో పాటు, ప్రత్యేక బలగాలతో భద్రత కల్పించేవారు. 1987లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ కశ్మీర్‌ పర్యటనకు వెళ్లారు. ప్రతికూల వాతావరణం వల్ల శ్రీనగర్‌లో చిక్కుకుపోయారు. అప్పుడు పాలన యంత్రాంగం మొత్తం జమ్మూలో ఉంది.

మూడు రాజధానుల ఆంశంలో బయట పడిన వైఎస్సార్​సీపీ అసలు రంగు

ఆరు నెలలకోసారి రాజధానిని తరలించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రాజీవ్‌ భావించారు. ఈ పద్ధతిని మార్చాలని అప్పటి సీఎం ఫరూక్‌ అబ్దుల్లాకు సూచించగా.. ఆయన ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ దర్బార్‌ మూవ్‌ రద్దుకు సిఫారసు చేసినా కొన్ని కారణాల వల్ల అమలు కాలేదు. ఒమర్‌ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉండగా కొంత ప్రయత్నం జరిగినా.. అదీ సఫలం కాలేదు.

2020లో జమ్మూకశ్మీర్‌ హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించింది. ‘దర్బార్‌ మూవ్‌’తో వీసమెత్తు ప్రయోజనం లేదని అభిప్రాయపడింది. ఏటా 200 కోట్లు ఖర్చు చేసి ఇంత తతంగం అవసరమా ఆలోచించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. 2021లో జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ‘దర్బార్‌ మూవ్‌’ను రద్దు చేశారు. ఇ-ఫైలింగ్‌ విధానం అందుబాటులోకి వచ్చి, పరిపాలన మొత్తం ఆన్‌లైన్‌లో జరుగుతున్న ఈ రోజుల్లో కూడా ‘దర్బార్‌ మూవ్‌’ అర్థంలేని చర్యగా భావించి తీసేశారు.

మూడు రాజధానుల ఉద్యమంపై త్వరలోనే రూట్​మ్యాప్​: మంత్రి బొత్స

1327లో మహ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ తన రాజధానిని దిల్లీ నుంచి దౌలతాబాద్‌కు మార్చాలని నిర్ణయించారు. ఆ ప్రక్రియలో కొన్ని వేలమంది ప్రజలు ఆకలిదప్పులతో ప్రాణాలు కోల్పోయారు. చేతులు కాలాక తన తప్పు తెలుసుకుని అదే తుగ్లక్‌ 1334లో మళ్లీ రాజధానిని దౌలతాబాద్‌ నుంచి దిల్లీకి మార్చారు. ఈ మార్పు ప్రక్రియలో వేలాదిమంది ప్రజలు చనిపోవడంతోపాటు భారీగా ప్రజాధనం వృథా అయ్యింది. దీంతో ఆయన పిచ్చితుగ్లక్‌గా చరిత్రకెక్కారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలకులపైనా పిచ్చితుగ్లక్ ప్రభావం ఉన్నట్లుంది. దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులను అప్పట్లో ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదు కానీ.. ఇప్పుడు 21వ శతాబ్దంలోనూ అలా చేయడం నిజంగా తుగ్లక్‌ చర్యేనని ప్రముఖ పాత్రికేయుడు 'ది ప్రింట్‌' ఎడిటర్ శేఖర్‌గుప్తా అన్నారు. 2019లో ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటన చేసిన వెంటనే ఆయన దీన్ని ఖండిస్తూ.. దానివల్ల జరగబోయే అనార్థాలను వివరిస్తూ ఓ విడియో విడుదల చేశారు.

ఇంకెన్నాళ్లీ మోసం?.. రాజధానిపై పూటకో మాట.. రోజుకో ప్రకటన.. మండిపడుతున్న రాజధాని రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.