ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈశాన్య రుతుపవనాలు.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ఓ ప్రకటన చేసింది. తమిళనాడు వార్షిక వర్షపాతంలో.. ఎక్కువ మొత్తం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొనసాగే ఈశాన్య రుతు పవనాల ద్వారానే నమోదు కానుంది.
తమిళనాడు తీరప్రాంతాలు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తా ప్రాంతాల్లోకి ఈశాన్య రుతుపవనాలు ఇవాళ ప్రవేశించినట్లు.. వాతావరణ శాఖ ప్రకటించింది. బంగాళాఖాతం, దక్షిణ ద్వీపకల్పం మీదుగా ఈశాన్య గాలులు, రుతుపవనాల ప్రభావంతో ఆయా ప్రాంతాల్లో వర్షాలు మొదలైనట్లు తెలిపింది.