ETV Bharat / bharat

అమూల్​ X నందిని.. కర్ణాటకలో 'పాల' రాజకీయం.. 'గుజరాతీలకు వారు శత్రువులా?' - కర్ణాటక నందిని పాలు ఎన్నికలు

కర్ణాటక శాసనసభ ఎన్నికల వేళ.. ఆ రాష్ట్రంలో నందిని పాలకు పోటీగా అమూల్ ఎంట్రీతో దుమారం రేగుతోంది. నందిని బ్రాండ్‌ పాలకు బెంగళూరు హోటల్ యజమానుల సంఘం పూర్తి మద్ధతు ప్రకటించింది. తమ హోటళ్లలో నందిని పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తామని ప్రకటించింది. మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. బీజేపీపై మండిపడ్డారు. లక్షలాది మందికి జీవనాధారమైన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్​ను మూసేసి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేయబోతోందని ఆరోపించారు.

amul vs nandini in karnataka former cm siddaramiah comments on modi

author img

By

Published : Apr 9, 2023, 7:22 PM IST

శాసనసభ ఎన్నికల వేళ కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. కర్ణాటక పాల సమాఖ్య ఆధ్వర్యంలోని నందిని పాల ఉత్పత్తులకు పోటీగా గుజరాత్‌కు చెందిన అమూల్‌ సంస్థకు అవకాశం కల్పించడం రాజకీయంగా పెనుదుమారం రేపింది. దీంతో నందిని బ్రాండ్‌ పాలకు బెంగళూరు హోటల్ యజమానుల సంఘం పూర్తి మద్ధతు ప్రకటించింది. ఇకపై తమ హోటళ్లలో నందిని పాలు, పాల ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తామని ప్రకటించింది.

కర్ణాటక పాల సమాఖ్యను, పాల రైతులను ఆదుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అటు బసవరాజ్​ బొమ్మై సర్కార్ తీసుకున్న నిర్ణయం కర్ణాటకలో పాడిపరిశ్రమపై ఆధారపడిన 28 లక్షల మంది రైతులకు అన్యాయం జరుగుతోందని జేడీఎస్​ సహా కన్నడ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నందిని బ్రాండ్‌ను అమూల్‌లో విలీనం చేసేందుకు సర్కార్ యత్నిస్తోందని ఆరోపించాయి. కాగా అమూల్‌ పాలపై వస్తున్న రాజకీయ విమర్శలను ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ఖండించారు.

'మోదీ.. కర్ణాటక వస్తుంది దోచుకోవడానికా?'
బెంగళూరులో అమూల్​ ఉత్పత్తుల విక్రయంపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని.. నందినిని కాపాడాలని, వాటి ఉత్పత్తులను రక్షించాలని సిద్ధరామయ్య డిమాండ్‌ చేశారు. అమూల్‌ కొనబోమని, కేవలం నందిని పాలను కొంటామని కన్నడ ప్రజలు ప్రతిజ్ఞ‌ చేయాలని పిలుపునిచ్చారు. లక్షలాది మందికి జీవనాధారమైన కర్ణాటక మిల్క్ ఫెడరేషన్​ను మూసేసి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేయబోతోందని ఆరోపించారు.

"కర్ణాటకకు మోదీ వస్తుంది.. ఏమైనా ఇవ్వడానికా? లేదా ఇక్కడ ఉన్నవి దోచుకోవడానికా? కన్నడిగుల నుంచి ఇప్పటికే బ్యాంకులు, ఓడరేవులు, విమానాశ్రయాలు దొంగలించారు. ఇప్పుడు మా నుంచి నందిని దొంగిలించాలని చూస్తున్నారా? ఓడరేవులు, విమానాశ్రయాలను గుజరాత్‌లోని అదానీకి అప్పగించారు. ఇప్పుడు గుజరాత్‌కు చెందిన అమూల్​.. మా నందిని పాల ఉత్పత్తులను దెబ్బతీయాలని ప్లాన్ చేస్తోంది. మిస్టర్​.. నరేంద్ర మోదీ.. మేము గుజరాతీలకు శత్రువులమా?" అంటూ సిద్ధరామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

'అమూల్​కు భయపడాల్సిన అవసరం లేదు!'
నందిని పాల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై.. శనివారం స్పందించారు. 'నందిని' కర్ణాటకకు గర్వకారణమని, జాతీయ స్థాయిలో నంబర్‌వన్‌గా నిలిచేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని తెలిపారు. నందిని మార్కెట్ విస్తృతంగా ఉందని, అమూల్‌కు భయపడాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ప్రతి విషయాన్ని కాంగ్రెస్ రాజకీయం చేయడం సరి కాదని ఆయన అన్నారు.

బెంగళూరులో వెస్ట్​ టు ఈస్ట్​!
బెంగళూరులోని కెంగేరి(వెస్ట్) నుంచి వైట్​ఫీల్డ్(ఈస్ట్​)​ వరకు అమూల్ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు అమూల్​.. బుధవారం ట్వీట్ చేసింది. పాలు, పెరుగు డెలివరీని సులభతరం చేయడానికి ప్రముఖ డోర్​ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తామని అమూల్​ మరో ట్వీట్‌లో తెలిపింది.

ప్రచారాస్త్రాలుగా పాలు, పెరుగు!
కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో పాలు, పెరుగు కూడా ప్రచారాస్త్రాలుగా మారాయి! సహకార సంఘంగా నడుస్తున్న నందిని పాలు, పాల ఉత్పత్తులకు కన్నడనాట విశేష ఆదరణ ఉంది. కన్నడిగుల ప్రజాజీవనంలో నందిని ఒక భాగంగా మారింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌కు చెందిన అమూల్‌ పాలు, పాల ఉత్పత్తులను కర్ణాటకలో ప్రవేశపెట్టడం వల్ల ప్రతిపక్షాలు చేతికి కొత్త ఆయుధం లభించింది! నందిని పాల ఉత్పత్తుదారుల జీవితాలతో బీజేపీ చెలగాటమాడుతోందని విపక్షాల నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఒకే విడతలో 224 స్థానాలకు ఎన్నికలు..
కర్ణాటకలో మే 10న శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. 224 శాసనసభ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నువ్వా-నేనా స్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. జేడీఎస్​ కూడా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.