ETV Bharat / bharat

'వారి రాజకీయాలతో బంగాల్​ వైభవానికి విఘాతం' - amit latest visit to bengal news

బుజ్జగింపు రాజకీయాలు బంగాల్​ ఆధాత్మిక వైభవాన్ని దెబ్బతీస్తున్నాయని మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ మేరకు పరోక్ష విమర్శలు చేశారు.

amit-shah-says-appeasement-politics-has-hurt-west-bengals-tradition
'బంగాల్​ సంప్రదాయానికి హాని కలిగించేవి అవే'
author img

By

Published : Nov 6, 2020, 3:49 PM IST

బంగాల్​లో రెండు రోజుల పర్యటనలో భాగంగా కోల్​కతాలోని దక్షిణేశ్వర్​ కాళీ దేవాలయాన్ని శుక్రవారం దర్శించుకున్నారు హోంమంత్రి అమిత్​షా. ఆధ్యాత్మికత, మతసామరస్యం బంగాల్​కే గర్వకారణం అన్నారు. వాటిని రాష్ట్రంలో పునరుద్ధరించాలని బంగాల్​ ప్రజలను కోరారు.

"చైతన్య మహాప్రభు, ఠాగూర్ ,​ రామకృష్ణ పరమహంస, వివేకానంద లాంటి గొప్ప వ్యక్తులు నడయాడిన చోటు బంగాల్. కానీ బుజ్జగింపు రాజకీయాల కారణంగా బంగాల్​ వైభవం దెబ్బతింటోంది. "

---అమిత్​షా, హోంమంత్రి

పర్యటనలో భాగంగా సీఆర్​పీఎఫ్​ సీనియర్​ అధికారులతో భేటీ అయ్యారు. బంకురా చతుర్థి గ్రామంలోని ఓ గిరిజన కుటంబంతో కలిసి భోజనం చేశారు. బంగాల్ సీనియర్​ భాజపా నాయకులతో రానున్న ఎన్నికలపై చర్చించారు.

లాక్​డౌన్​ తర్వాత అమిత్​షా బంగాల్​కు రావటం ఇదే మొదటిసారి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.