ETV Bharat / bharat

విమానం కాక్​పిట్​లోకి స్నేహితురాలిని పిలుచుకున్న పైలట్.. 3 గంటలు పాటు.. - డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్

దుబాయి-దిల్లీ ఎయిరిండియా విమానంలోని కాక్‌పిట్‌లోకి స్నేహితురాలిని పైలట్‌ అనుమతించిన ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఈ నిర్ణయం తీసుకుంది. పైలట్‌పై సస్పెన్షన్ లేదా లైసెన్స్‌ రద్దు చేసే అవకాశం ఉంది.

air-india-pilot-allows-female-friend-inside-cockpit-dgca-probe-on-it
ఎయిర్ ఇండియా కాక్‌పిట్​లోకి పైలట్ స్నేహితుడు
author img

By

Published : Apr 21, 2023, 12:14 PM IST

Updated : Apr 21, 2023, 1:17 PM IST

నిబంధనలకు విరుద్ధంగా ఓ పైలట్‌ విమానంలోని కాక్‌పిట్‌లోకి స్నేహితురాలిని అనుమతించిన ఘటనపై పౌరవిమానయాన డైరెక్టర్‌ జనరల్-DGCA విచారణకు ఆదేశించింది. ఫిబ్రవరి 27న దుబాయి నుంచి దిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానంలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విమానంలో ప్రయాణికురాలిగా ఉన్న ఓ మహిళ తనకు స్నేహితురాలు కావడంతో పైలట్‌ ఆమెను కాక్‌పిట్‌లోకి అనుమతించాడు. దాదాపు 3 గంటలపాటు ఆ మహిళ కాక్‌పిట్‌లోనే ప్రయాణించినట్లు తెలిపారు.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన DGCA.. దర్యాప్తునకు ఆదేశించింది. ఈ సంఘటన భద్రతా నియమాలను ఉల్లంఘించడమేనని.. DGCA అధికారి ఒకరు తెలిపారు. విమానం, అందులోని ప్రయాణికుల భద్రతను పట్టించుకోకుండా.. పైలట్‌ చేసిన పనికి అతని సస్పెన్షన్ లేదా లైసెన్స్‌ రద్దు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఘటనను తాము సీరియస్​గా తీసుకున్నామని ఎయిర్​ ఇండియా వెల్లడించింది. సంస్థ పరిధిలో దీనిపై విచారణ జరుగుతోందని తెలిపింది. దీనిపై డీసీజీఐకు రిపోర్ట్​ చేశామని.. దర్యాప్తులో వారికి పూర్తిగా సహకరిస్తామని పేర్కొంది. ఎయిర్​ ఇండియా ఫ్లైట్​ నంబర్​ AI-915లో ఈ ఘటన జరిగింది. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంశాలలో విమానయాన సంస్థకు ఎలాంటి రాజీ ఉండదని ఎయిర్​ ఇండియా ప్రతినిధి తెలిపారు. పైలట్​పై అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దర్యాప్తు బృందం సాంకేతిక, భద్రత కోణంలో వాస్తవాలను పరిశీలిస్తుందని ఆయన వెల్లడించారు.

"మహిళ ప్రయాణికురాలు కాక్​పిట్​లోకి వెళ్లిన వెంటనే ఆమె సౌకర్యం కోసం.. కొన్ని దిండ్లు తీసుకురమ్మని కెప్టెన్​ (పైలట్) నాకు చెప్పారు. కాక్​పిట్​ రూంలో వెచ్చగా, సౌకర్యవంతంగా ఉంటుందని అందుకే.. ఆమె కోసం లివింగ్ రూం సిద్ధం చేస్తున్నానని పైలట్​ చెప్పారు. దాంతో పాటు ఆమెకు డ్రింక్స్​, స్నాక్స్​ ఆర్డర్​ ఇవ్వమని నన్ను అడిగారు" అని ఘటన సమయంలో విమానంలో పనిచేసిన మహిళ హోస్ట్​ తెలిపారు.

ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్యాంప్‌బెల్ విల్సన్.. పైలట్​పై డీజీసీఏకి ఫిర్యాదు చేశారు. POSH(లైంగిక వేధింపుల ఫిర్యాదుల నివారణ), పౌర విమానయాన నిబంధనలు, ఎయిర్ సేఫ్టీ నిబంధనలను పైలట్ ఉల్లంగించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. సాధారణంగా అనధికారమైన వ్యక్తులకు కాక్​పిట్​లోకి ప్రవేశం ఉండదు. అయినా పైలట్​ తన స్నేహితులరాలి కాక్​పిట్​లోకి అనుమతించాడు. దీంతో డీసీజీఏ చర్యలకు ఆదేశించింది.

మంచి నిద్రలో పైలట్లు 37 వేల అడుగుల ఎత్తులో విమానం చక్కర్లు..
విమానం 37 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా అందులోని ఇద్దరు పైలట్లూ ఆదమరిచి నిద్రపోయారు. గతేడాది ఆగస్టులో ఈ ఘటన జరిగింది. ఈఏకు చెందిన బోయింగ్‌ 737 విమానం సూడాన్‌ నుంచి ఇథియోపియా రాజధాని ఆడిస్‌ అబాబాకు ప్రయాణమైంది. కొద్దిసేపటి తర్వాత పైలట్లు లోహవిహంగాన్ని ఆటోపైలట్‌ మోడ్‌లో ఉంచారు. ఆపై వారిద్దరూ నిద్రలోకి జారుకున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Apr 21, 2023, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.