ETV Bharat / bharat

తాగునీటి విషయంలో కేంద్రం కొత్త రూల్స్, ఇక అవి తప్పనిసరి - accessibility for divyangs

తాగునీటి పాయింట్లు దివ్యాంగులకు కూడా అనుకూలంగా ఉండేలా హ్యాండిళ్లు వంటివాటిని అమర్చడం, ఆటోమేటిక్‌ సెన్సర్లు, బ్రెయిలీ లిపిలో సూచికలు పెట్టడం తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈమేరకు కొత్త మార్గదర్శకాలతో ముసాయిదా రూపొందించింది.

accessibility for disabled in india
తాగునీటి విషయంలో కేంద్రం కొత్త రూల్స్, ఇక అవి తప్పనిసరి
author img

By

Published : Aug 22, 2022, 7:46 AM IST

వివిధ ప్రాంతాల్లో తాగునీటి పాయింట్ల వద్ద దివ్యాంగులు, వృద్ధులు, దుర్బల పరిస్థితుల్లో ఉన్నవారికి సులువుగా, సౌకర్యవంతంగా నీళ్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసేందుకు కేంద్రం తాజా మార్గదర్శకాలతో ముసాయిదాను రూపొందించింది. కుళాయిలను చేతితో తిప్పాల్సిన అవసరం లేకుండా పాదాలతోనే ఆపరేట్‌ చేయగలిగేలా పెడళ్లను ఏర్పాటు చేయడం.. తాగునీటి పాయింట్ల వద్ద అనుకూలంగా ఉండేలా హ్యాండిళ్లు వంటివాటిని అమర్చడం.. ఆటోమేటిక్‌ సెన్సర్లు, బ్రెయిలీ లిపిలో సూచికలు పెట్టడం వంటివన్నీ ముసాయిదాలో ఉన్నాయి. తాగునీరు, పారిశుద్ధ్య విభాగం ఈ మార్గదర్శకాలను రూపొందించింది. ముసాయిదా ముఖ్యాంశాలివి..

  • గర్భిణులు, చిన్నపిల్లలున్న తల్లులు, తాత్కాలికంగా శారీరక సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా అనుకూలంగా ఉండేలా తాగునీటి పాయింట్లు ఏర్పాట్లు చేయాలి.
  • అంగన్వాడీ కేంద్రాలు; ప్రాథమిక, మాధ్యమిక, రెసిడెన్షియల్‌ పాఠశాలలు; అన్నిరకాల వైద్య, ఆరోగ్య కేంద్రాలు; ఆసుపత్రులు, పంచాయతీ కార్యాలయాలు, మార్కెట్‌లు వంటి చోట్ల ఈ నిబంధనలు అమలు చేయాలి.
  • చిన్నపిల్లలకు కూడా సులువుగా అందుబాటులో ఉండేలా తాగునీటి పాయింట్లు (ఎత్తు, అనువైన ప్రాంతం) ఉండాలి. అలాగే స్వల్ప లేదా పాక్షిక దృష్టి లోపం ఉన్నవారికి అనుగుణంగా వాటికి రంగులు వేయాలి.
  • చిన్నపిల్లల కోసం 500-700 మి.మీ.లు; వీల్‌ఛైర్‌ వినియోగించే దివ్యాంగుల కోసం 850 మి.మీ.ల ఎత్తులో కుళాయిలు ఉండాలి. అవసరం మేరకు రెండు రకాల ఎత్తుల్లోనూ ఏర్పాటు చేయాలి.

కోట్ల మందికి ప్రయోజనం..
తాజా ప్రతిపాదనలను హక్కుల గ్రూపులు స్వాగతించాయి. అయితే కచ్చితంగా అమలయ్యేలా చూడాలని సూచించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి చర్యలు అవసరమని, దీంతో దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని దివ్యాంగుల ఉపాధి ప్రోత్సాహక జాతీయ కేంద్రం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అర్మాన్‌ అలీ ‘పీటీఐ’ వద్ద పేర్కొన్నారు. కాగితాలపై చక్కగా ఉన్న ఈ నిబంధనలు వాస్తవ రూపం దాల్చాలని ఏజ్‌వెల్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ హిమాన్షు రహా పేర్కొన్నారు. దుర్బల స్థితిలో ఉన్నవారికి సురక్షిత తాగునీరు నిరంతరాయంగా అందే విషయమై తొలుత దృష్టి సారించాలని సూచించారు. ‘‘దేశంలోని అన్ని ఇళ్లకూ కుళాయిల ద్వారా నీళ్లు అందించలేకపోతే.. కలుషితం కాని తాగునీరు అందించడం సవాల్‌గానే మిగులుతుంది’’ అని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.