ETV Bharat / bharat

అత్తమామలు డైరీ చదివారని.. యువతి ఆత్మహత్య.. అందులో ఏముందంటే? - వ్యక్తిగత డైరీ చదివారని ఉరివేసుకున్న యువతి

తన వ్యక్తిగత డైరీని అత్తమామలు చదివారని ఆత్మహత్యకు పాల్పడింది ఓ యువతి. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

suicide
ఆత్మహత్య
author img

By

Published : Jul 22, 2022, 12:18 PM IST

తన వ్యక్తిగత డైరీని మామ, అత్త చదివారని.. ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది ఓ యువతి. ఈ ఘటన మహారాష్ట్ర నాగ్​పుర్​లోని సావనేర్ పోలీసు స్టేషన్​ పరిధిలో జరిగింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అసలేం జరిగిందంటే: నికితా డహట్​​ అనే యువతి తన మామ ఇంట్లో ఉంటోంది. ఆమెకు చిన్నప్పటి నుంచి ప్రతిరోజు డైరీ రాసుకోవడం అలవాటు. ఎవరికీ చెప్పలేని విషయాలన్నీ ఈ డైరీలో రాసుకునేది నికిత. అలా రాయడం వల్ల మనసుకు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంటుందని ఆమె నమ్మకం. ఆమె మామ రత్నాకర్.. కాలేజీలో ప్రొఫెసర్​గా పనిచేస్తున్నాడు. అత్త మంగళ గృహిణి.

నికిత డైరీని దొంగిలించి రత్నాకర్, మంగళ రహస్యంగా ఓ రోజు చదివారు. అందులో తన అత్త 'దెయ్యం' అని రాసింది నికిత. దీంతో.. నికిత బంధువులను పిలిచి తన గురించి దెయ్యం అని డైరీలో రాసిందంటూ కోప్పడ్డారు ఆమె అత్తమామలు. దీనిపై సమాధానం చెప్పాలని బంధువులందరి ముందు నిలదీశారు. దీంతో ఒత్తిడికి లోనై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది నికిత. దీనికి బాధ్యులైన మామ రత్నాకర్, అత్త మంగళపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు మృతురాలి సోదరుడు పంకజ్. నికిత చిన్నప్పటి నుంచి ధాపేవాడాలోని తన తాత వాళ్లింట్లోనే ఉంటోంది. ఎమ్మెస్సీ పూర్తి చేసి ఈ మధ్యే ప్రైవేట్ ఉద్యోగంలో చేరింది. ఇంతలోనే ఇలా అనంత లోకాలకు వెళ్లిపోయింది.

ఇవీ చదవండి: భారీ కుట్ర భగ్నం.. 2 కిలోల యురేనియంతో చిక్కిన స్మగ్లర్లు.. 15 మంది అరెస్ట్​

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.