ETV Bharat / bharat

భారీ వర్షాలకు 14 మంది బలి - బంగాల్​ వరదలు 2021

బంగాల్​లో భారీ వర్షాల కారణంగా 14 మంది మృతిచెందారు. 2.5 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. వరద బాధితుల కోసం సహాయక చర్యలు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు.

Bengal rains, బంగాల్​ వరదలు
బంగాల్​లో భారీ వర్షాలకు 14 మంది మృతి
author img

By

Published : Aug 3, 2021, 4:01 PM IST

బంగాల్​లో వరదల ధాటికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు దామోదర్​ లోయ ప్రాంతంలోని ఆనకట్టల నుంచి పోటెత్తిన వరదల కారణంగా ఆరు జిల్లాలకు చెందిన 2.5 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు.

తూర్పు వర్ధమాన్​, పశ్చిమ్​ వర్ధమాన్​, పశ్చిమ మెదినీపుర్​, హూగ్లీ, హావ్​డా, దక్షిణ 24 పరగణాలు జిల్లాలను వరదలు ముంచెత్తాయని అధికారులు పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బాధితులకు వసతులు కల్పిస్తున్నామని.. టార్పాలిన్​, బియ్యం​, దుస్తులు, తాగునీటిని సరఫరా చేస్తున్నామని వివరించారు.

ఇదీ చూడండి : 'సాగర్'​ సమీపంలో కూలిన ఆర్మీ హెలికాప్టర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.