Covid Cases in India: దేశంలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 6,563 కేసులు నమోదుకాగా వైరస్ ధాటికి 132 మంది ప్రాణాలు కోల్పోయారు. 8,077 మంది కోలుకున్నారు. 572 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు చేరుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం కేసులు: 3,47,46,838
మొత్తం మరణాలు: 4,77,554
యాక్టివ్ కేసులు: 82,267
కోలుకున్నవారు: 3,41,87,017
Vaccination in India
దేశంలో టీకా పంపిణీ విస్తృతంగా కొనసాగుతోంది. ఆదివారం మరో 15,82,079 మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,37,67,20,359కు చేరింది.
Covid world cases
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఒక్కరోజే 4,74,101 కేసులు వెలుగులోకి వచ్చాయి. 3870 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాలో కొత్తగా 66 వేల కేసులు వెలుగుచూశాయి. వైరస్ ప్రభావానికి 109 మంది ప్రాణాలు కోల్పోగా.. 24,730 మంది కోలుకున్నారు.
- బ్రిటన్‌లో వైరస్ విజృంభిస్తోంది. తాజాగా 82 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. 45 మంది మరణించారు. 13 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
- ఫ్రాన్స్‌లో 48 వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 75 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 86 లక్షల 77 వేలకు చేరుకుంది.
- రష్యాలో కరోనా మరణాల సంఖ్య భారీగానే నమోదవుతోంది. కొత్తగా 27 వేల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 1,023 మంది కొవిడ్‌తో మృతిచెందారు.
ఇదీ చూడండి : టీకా మూడు డోసులు తీసుకున్న వ్యక్తికి.. ఒమిక్రాన్ పాజిటివ్!