ETV Bharat / bharat

రూ.5 స్నాక్స్​ ప్యాకెట్​లో రూ.500 నోట్లు.. దుకాణాల వద్ద గ్రామస్థుల క్యూ.. - ఐదు రూపాయల కుర్​కురే ప్యాకెట్​లో 500 నోటు

ఐదు రూపాయల స్నాక్స్​ ప్యాకెట్‌లో 500 రూపాయల నోటు దొరికింది. దీంతో ఆశ్చర్యపోయిన గ్రామస్థులు ప్యాకెట్​ కొనుగోలు చేసేందుకు దుకాణం చుట్టూ బారులు తీరారు. ఈ వింత సంఘటన కర్ణాటకలో జరిగింది.

500 rupees notes found in 5 rupees kurkare packet
కుర్​కురే ప్యాకెట్​లో దొరికిన 500 రూపాయల నోటు
author img

By

Published : Dec 17, 2022, 11:18 AM IST

Updated : Dec 17, 2022, 4:30 PM IST

కర్ణాటక రాయిచూర్​లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. హూనూర్ గ్రామంలోని ఓ వ్యక్తి కొనుక్కున్న స్నాక్స్​ ప్యాకెట్​లో అక్షరాల రూ.500 నోటు దొరికింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులంతా ఆశ్యర్యానికి గురయ్యారు. మొదట ఈ విషయాన్ని ఎవరూ నమ్మలేదు. అయితే ఆ తర్వాత కూడా కొంతమందికి అలానే డబ్బులు దొరకడం వల్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడింది. దీంతో ఆ స్నాక్​ ప్యాకెట్​ను కొనేందుకు స్థానికులంతా ఆసక్తి చూపారు.

ఆ ప్యాకెట్​ను కొనుగోలు చేసేందుకు గ్రామస్థులంతా దుకాణాలకు బారులు తీరారు. గ్రామస్థులు ఆ స్నాక్స్​ ప్యాకెట్స్ కోసం ఎగబడటం వల్ల ఆ గ్రామంలో ఉన్న ప్యాకెట్లన్నీ ​అమ్ముడుపోయాయి. ఇప్పుడు గ్రామంలోని ఏ షాపులోనూ ఆ స్నాక్స్​ ప్యాకెట్స్ దొరకడం లేదని ఓ దుకాణ యజమాని తెలిపారు.

Last Updated : Dec 17, 2022, 4:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.