కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల కొవిడ్-19 రెండో దశలో సుమారు 50 లక్షల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అయితే.. కరోనా కారణంగా దేశంలో 4.18 లక్షల మరణాలు సంభవించినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
కరోనా మరణాలపై ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. 2021, జూన్ వరకు కరోనా మరణాలపై సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ నివేదికను ట్విట్టర్లో షేర్ చేశారు.
" ఇదే నిజం.. కొవిడ్ రెండో ఉద్ధృతిలో భారత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో మన చెల్లెళ్లు, సోదరులు, తల్లులు, తండ్రులు సుమారు 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు" అని రాసుకొచ్చారు రాహుల్.
ఇదీ చూడండి: viral video: నమస్తే పెట్టలేదని కర్రలతో దాడి