ETV Bharat / bharat

200 మంది మహిళలు.. 4000 నగ్నఫొటోలు.. సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ గలీజ్ దందా! - noida nude photos crime

4000 Nude Photos Crime: చదివింది బీటెక్, ఎంబీఏ.. దిగ్గజ టెక్ సంస్థలో ఉద్యోగం.. చేసే పనులు మాత్రం నీచాతినీచం. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 200 మంది మహిళల్ని వేధించాడు. బెదిరించి 4వేల నగ్న ఫొటోలు సేకరించి.. విదేశీ అశ్లీల వెబ్​సైట్​లకు అమ్మేశాడు. చివరకు ఊచలు లెక్కిస్తున్నాడు.

4000-nude-photos-of-over-200-women
200 మహిళలు.. 4000 నగ్నఫొటోలు.. సాఫ్ట్​వేర్​ ఇంజినీర్ గలీజ్ దందా!
author img

By

Published : Mar 1, 2022, 6:24 PM IST

Nude Photos Crime: బాలికలు, విదేశీయులు సహా 200 మందికిపైగా మహిళల్ని బెదిరించి, వారి నగ్న చిత్రాలను పోర్న్​ సైట్స్​కు అమ్మిన కీచకుడ్ని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అతడి ల్యాప్​టాప్​లో ఏకంగా 4వేల నగ్న ఫొటోలు చూసి విస్తుపోయారు. మెకానికల్ ఇంజినీరింగ్, ఎంబీఏ చదివి.. ఓ అంతర్జాతీయ దిగ్గజ సంస్థలో ఉద్యోగం చేస్తున్న నిందితుడు మోహిత్ శర్మ(33) ఈ అక్రమ దందా సాగిస్తున్న తీరును సోమవారం వెల్లడించారు దిల్లీ పోలీసులు.

Crime news today

సాక్ష్యాలు ఏమాత్రం దొరకకుండా..

ఇన్​స్టాగ్రామ్​ ద్వారా పరిచయమైన ఓ మహిళ తమను బెదిరించి, నగ్న చిత్రాలు తీసుకుందని 2020 సెప్టెంబర్, 2021 జూన్​లో దిల్లీ సైబర్​ సెల్ పోలీసులకు ఆన్​లైన్​ ద్వారా రెండు ఫిర్యాదులు అందాయి. దిల్లీ పోలీసు శాఖలోని ఐఎఫ్​ఎస్​ఓ(ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్​) విభాగం రంగంలోకి దిగి.. దర్యాప్తు ప్రారంభించింది. ఆ ఇన్​స్టాగ్రామ్​ ఐడీని, దానికి క్రియేట్ చేసేందుకు ఉపయోగించిన ఈమెయిల్ ఐడీని ట్రాక్ చేసింది. నొయిడాలోని ఓ ఇంటి నుంచే ఇదంతా జరిగిందని గుర్తించింది.

ఏసీపీ రామన్ లాంబా, ఇన్​స్పెక్టర్​ అరుణ్ త్యాగి బృందం ఆ ఇంటికి వెళ్లగా.. మోహిత్ శర్మ ఉన్నాడు. ఆ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన వైఫై హ్యాక్ అయిందని, ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశానని చెప్పుకొచ్చాడు. అయినా పోలీసుల బృందం అతడి ఫోన్లు, ల్యాప్​టాప్​లు అన్నింటినీ పరిశీలించింది. ఒక్కటంటే ఒక్క ఫొటో కూడా లేదు. అనుమానంతో ఆ డివైజ్​లు అన్నింటినీ ఫోరెన్సిక్ అనాలిసిస్​కు పంపింది. అక్కడే అసలు విషయం తెలిసింది. మోహిత్ శర్మ.. 200 మందికిపైగా మహిళలకు సంబంధించిన 4వేల నగ్న ఫొటోలు సేకరించినట్లు నిర్ధరించింది.

Nude photographs crime

మహిళనని చెప్పుకుంటూ 'సైడ్​ బిజినెస్​'...

మోహిత్ చివరకు నిజం అంగీకరించాడు. ఇది తన సైడ్ బిజినెస్​ అని చెప్పాడు. ఈ అక్రమ దందా ఎలా సాగించాడో పూస గుచ్చినట్లు వివరించాడు. మోహిత్ చెప్పినదాని ప్రకారం.. ఓ ఫ్యాషన్​ మేగజిన్ ఎడిటర్​(మహిళ)గా పరిచయం చేసుకుంటూ ఇన్​స్టాగ్రామ్​లో అమ్మాయిలకు వల వేసేవాడు. మాయమాటలు చెప్పి.. ముఖం కనిపించకుండా నగ్న ఫొటోలు పంపమని వారిని కోరేవాడు. మోసపోయి పంపిన వారిని బెదిరించడం మొదలుపెట్టేవాడు. మరిన్ని నగ్న ఫొటోలు, వీడియోలు పంపాలని.. లేదంటే ఇప్పటికే తన దగ్గర ఉన్నవాటిని బాధితుల స్నేహితులు, బంధువులకు పంపుతానని హెచ్చరించేవాడు. ఇలా సేకరించిన ఫొటోలు, వీడియోలను విదేశీ అశ్లీల వెబ్​సైట్​లకు విక్రయించేవాడు.

మోహిత్​ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై ఐటీ చట్టంలోని సెక్షన్ 66సీ, ఐపీసీలోని 419, పోక్సో చట్టంలోని వేర్వేరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న అతడు.. ఇంతకుముందు కూడా ఇలాంటి నేరాలకు పాల్పడి, విచారణ ఎదుర్కొన్నట్లు గుర్తించారు.

ఇదీ చదవండి: పబ్​జీ చిచ్చు.. స్నేహితుడిని కత్తితో పొడిచి చంపి...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.