Four girls drowned: కేంద్రపాలిత ప్రాంతం దమ్న్ దీవ్లోని దమన్ నగరంలో విషాద ఘటన జరిగింది. జంపోర్ బీచ్‌లో సరదాగా వాకింగ్‌కు వెళ్లిన ఓ కుటుంబంలోని నలుగురు అమ్మాయిలు సముద్రంలో మునిగి చనిపోయారు. వీరిలో ముగ్గురు మైనర్లు ఉన్నారు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం దమన్‌లో బంధువుల ఇంటికి వెళ్లింది. కుటుంబ సభ్యులందరూ సరదగా బీచ్‌కు వెళ్లారు. అయితే ఐదుగురు అమ్మాయిలు సముద్రంలోకి దిగిన తర్వాత భారీ అలలు వచ్చాయి. దీంతో వారు నీటమునిగారు. కుటుంబసభ్యులు కాపాడేందుకు ప్రయత్నించారు. ఒక్కరిని మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. మిగతా నలుగురు నీట మునిగి చనిపోయారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నలుగురు అమ్మాయిల్లో ఒకరు ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చారు.
![4 GIRLS DROWNED IN DAMAN SEA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-beach-4-girl-death-avbb-gn10020_03022022192706_0302f_1643896626_519_0302newsroom_1643904886_139.jpg)
Girls drowned in daman sea
తమకు సాయం చేయాలని అరుపులు, కేకలు వేసినా ఒక్కరు కూడా ముందుకు రాలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బీచ్‌లో పోలీసులే లేరని పేర్కొన్నారు. వాటర్ బోట్లు నడిపే ఏజెన్సీని సాయం కోరినా వారు కూడా స్పందించలేదని చెప్పారు. బీచ్‌లో సైన్ బోర్డు గానీ, హెల్ప్‌లైన్ నంబర్ గానీ లేదని వాపోయారు.
![4 GIRLS DROWNED IN DAMAN SEA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-beach-4-girl-death-avbb-gn10020_03022022192706_0302f_1643896626_159_0302newsroom_1643904886_1062.jpg)
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
![4 GIRLS DROWNED IN DAMAN SEA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14367325_945_14367325_1643948134266.png)
ఇదీ చదవండి: అటవీ అధికారిపై చిరుత దాడి.. లైవ్ వీడియో