ETV Bharat / bharat

మూడేళ్లలో రోడ్డు ప్రమాదాలకు 3.92 లక్షల మంది బలి! - రోడ్ ప్రమాదాల్లో మృతులు

గడిచిన మూడేళ్లలో సుమారు 3.92 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో (road accidents in India 2020) మరణించారని జాతీయ నేర గణాంక సంస్థ (NCRB report 2020) వెల్లడించింది. గతేడాది లక్షా 20 వేల మంది చనిపోయారని తెలిపింది. సగటున రోజుకు 328 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు పేర్కొంది.

1.20 lakh deaths due to negligence in road accidents in 2020, average 328 daily: Data
మూడేళ్లలో రోడ్డు ప్రమాదాలకు 3.92 లక్షల మంది బలి!
author img

By

Published : Sep 19, 2021, 5:29 PM IST

గత ఏడాది దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల (road accidents in India 2020) కారణంగా లక్షా 20 వేల మంది మరణించినట్లు జాతీయ నేర గణాంక సంస్థ (NCRB report 2020) వెల్లడించింది. నిర్లక్ష్యం కారణంగా రోజుకు సగటున 328 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నట్టు ఎన్​సీఆర్​బీ.. తన వార్షిక నివేదిక 'క్రైమ్‌ ఇండియా'లో (Crime India report) పేర్కొంది.

గడిచిన మూడేళ్లలో సుమారు 3 లక్షల 92 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించినట్లు నివేదికలో (Crime India 2020) తెలిపింది. అలాగే 2018 నుంచి ఇప్పటివరకు లక్షా 35 వేల ఢీకొట్టి పారిపోయిన కేసులు (Hit and Run cases in India) నమోదైనట్లు వెల్లడించింది.

లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక అన్ని రకాల నేరాల్లో తగ్గుదల కనిపించినప్పటికీ.. రోడ్డు ప్రమాదాల్లో (Lockdown road accidents) మాత్రం మార్పు రాలేదని నివేదికలో పేర్కొంది.

నిర్లక్ష్య మరణాలు

మరోవైపు, నిర్లక్ష్యం కారణంగా జరిగిన రైలు ప్రమాదాల్లో 52 మంది మరణించారని ఎన్​సీఆర్​బీ పేర్కొంది. 2019లో 55, 2018లో 35 మంది ఇలా చనిపోయినట్లు తెలిపింది. వైద్య నిర్లక్ష్యం కారణంగా 133 మంది, స్థానిక సంస్థల నిర్లక్ష్యం వల్ల 51 మంది చనిపోయారని వెల్లడించింది.

ఇదీ చదవండి: ఒక్కరోజు హడావుడేనా?: వ్యాక్సినేషన్​ రికార్డ్​పై రాహుల్​ సెటైర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.