ETV Bharat / bharat

రెండు కిలోమీటర్ల రైల్వే ట్రాక్​ను ఎత్తుకెళ్లిన దొంగలు.. అధికారుల అండతోనే! - Railway Track Theft

బిహార్​లోని సమస్తిపుర్​ జిల్లాలో పనికిరాని(స్క్రాప్​) రైలు పట్టాలను ఎత్తుకెళ్లారు దొంగలు. కాగా, శాఖలో పనిచేసే అధికారుల అండదండలతోనే ఇది జరిగినట్లుగా రైల్వే పోలీసులు భావిస్తున్నారు.

Railway Track Theft
బిహార్​లో రైలు పట్టాలు చోరీ
author img

By

Published : Feb 6, 2023, 11:52 AM IST

రెండు కిలోమీటర్ల మేర ఉన్న పనికిరాని రైలు పట్టాల వ్యర్థాలను అపహరించారు దొంగలు. ఈ ఘటన బిహార్​లోని సమస్తిపుర్​ రైల్వే డివిజన్​ పరిధిలో జరిగింది. గతంలో మధుబని లోహత్​ షుగర్​ మిల్​ నుంచి పండోల్​ స్టేషన్​ వరకు రైల్వే లైన్​ వేశారు. అయితే ఏళ్ల తరబడి ఈ చక్కెర మిల్లు మూతపడి ఉండటం వల్ల ఈ మార్గం వినియోగంలో లేదు. దీంతో దొంగలు ఈ పట్టాలను తీసుకెళ్లిపోయారు. జనవరి 24న ఈ ఘటన వెలుగు చూసింది. కాగా, స్టేషన్​లో పని చేసే అధికారులే ఈ దొంగతనానికి సహకరించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై డిపార్ట్​మెంట్​లో అంతర్గత విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

ఈ కేసుపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసుకున్న దర్భంగా ఆర్​పీఎఫ్​​ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ చోరీకి బాధ్యుల్ని చేస్తూ డివిజన్ సెక్యూరిటీ కమిషనర్‌తో పాటు ఇద్దరు ఉద్యోగులను రైల్వే శాఖ సస్పెండ్ చేసింది. కాగా గతంలో పుర్నియా కోర్టు స్టేషన్​ పరిధిలో ఇలాగే.. ఓ రైల్వే ఇంజన్ చోరీకి గురైంది. గతేడాది నవంబరులో బెగుసరాయ్​ జిల్లా బరౌనీ ప్రాంతంలోనూ ఇదే తరహా ఘటన జరిగింది. గర్హరా రైల్వేయార్డ్​లో మరమ్మతులకోసం తీసుకువచ్చిన ఓ ట్రైన్ ​ఇంజిన్​ను.. దొంగలు మాయం చేశారు. దొంగలు ఈ ఇంజిన్​ను వారం రోజుల్లో కొన్ని ముక్కలుగా చేసి ఎత్తుకుపోతూ.. చివరకు ఇంజిన్​నే లేకుండా చేశారు. ఈ చోరీ కోసం ఆ దొంగల ముఠా ప్రత్యేక సొరంగ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

గత సంవత్సరం ఏప్రిల్​లో ఏకంగా బ్రిడ్జినే అపహరించారు బిహార్​ దొంగలు. ఎవరికీ అనుమానం రాకుండా మూడురోజుల్లో ఈ పనిని కానిచ్చేశారు. వాడుకలో లేని ఈ వంతెనలో భారీగా ఇనుము ఉండటం చూసి దొంగలు పక్కా పథకం పన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులమని చెప్పి గ్యాస్​ కట్టర్​లు, జేసీబీని ఉపయోగించి ఇనుమునంతా కట్ చేశారు. ఎంచక్కా దాన్ని డీసీఎంలో లోడ్ చేసి దర్జాగా తీసుకెళ్లారు. ఈ ఘటన ఎక్కడ? ఎలా జరిగిందనే పూర్తి వివరాలకు ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.