ETV Bharat / bharat

బాయ్​ఫ్రెండ్​ చేయి కోసేసిన ప్రేయసి.. హోటల్​కు తీసుకెళ్లి బాలికపై గ్యాంగ్​ రేప్ - బిహార్​లో యువకుడ్ని చంపిన మూక

బాయ్​ఫ్రెండ్ చేతిని కట్​ చేసింది ఓ ప్రేయసి. అనంతరం ఆత్యహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. మరో వైపు 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ 37 ఏళ్ల వ్యక్తి. ఇక ప్రేయసి కోసం వెళ్లిన ఓ యువకుడిపై ఒక మూక కిరాతకంగా దాడి చేసి చంపింది.

15  year old girl cut the vein of her boyfriend

author img

By

Published : Nov 1, 2022, 1:33 PM IST

కేరళలో దారుణం జరగింది. బాయ్​ఫ్రెండ్​ చేతి మణికట్టును కట్​ చేసింది ఓ ప్రబుద్ధురాలు. ఆపై అత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఈ ఘటన కోజికోడ్​ జిల్లాలో జరిగింది.
పోలీసులు వివరాల ప్రకారం.. కొడంచెరీకి చెందిన ఒక యువతి ఓ యువకుడితో రిలేషన్​షిప్​లో ఉంది. ఈ విషయం ఇంట్లో తెలియగా.. వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ కలిసి చనిపోవాలని నిర్ణయించుకున్నారు. తామరస్సెరీ బస్టాండ్​ వద్ద బస్​ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా యువతి రేజర్ బ్లేడ్ ​తీసి తన బాయ్​ఫ్రెండ్​ చేతి మణికట్టును కట్​ చేసింది. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. దీంతో స్థానికులు ఇద్దరినీ కాపాడి.. తామరస్సే తాలూక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

విద్యార్థిపై గ్యాంగ్ రేప్​..
ఓ పదో తరగతి బాలికను గ్యాంగ్ రేప్​ చేశారు కొందరు దుండగులు. హోటల్​కు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితుల్లోని ఇద్దరిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్​లో జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు పదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక ఇంటినుంచి బయటకు వెళ్లింది. అయితే దగ్గరున్న పార్కులో వాకింగ్​కు వెళ్లినట్టు భావించింది బాలిక తల్లి. ఎంతసేపటికీ ఆమె ఇంటికి తిరిగి రాకపోగా కుటుంబ సభ్యులంతా చుట్టుపక్కల ప్రదేశాల్లో గాలించారు. ఎంత వెతికినా బాలిక ఆచూకీ తెలియలేదు. అయితే ఆదివారం ఉదయం 10 గంటలకు ఇంటి సమీపంలో బాలిక కనిపించింది.

దీంతో రాత్రంగా ఎక్కడికి వెళ్లావని ఆరాతీశారు కుటుంబ సభ్యులు. రాత్రి తన స్నేహితులిద్దరు వచ్చి.. ఓ హోటల్​కు తీసుకెళ్లారని చెప్పింది. ఆ ఇద్దరితో పాటు మరో ముగ్గురు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తెలిపింది. జరిగిన దాని గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని చెప్పింది. ఈ మేరకు పోలీసులకు చేసిన ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొంది.

పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు ధ్రువీకరించారు. సోమవారం సాయంత్రం ఇద్దరు నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నామని వెస్ట్​ జోన్ డీసీపీ దీపక్ శర్మ తెలిపారు. మిగతా ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామని చెప్పారు.

మాంత్రికుడి మాటతో అత్యాచారం..
ఓ 8 ఏళ్లు బాలికపై 37 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక జననాంగాల నుంచి రక్తం వస్తే.. తన పెళ్లికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయన్న మూఢ నమ్మకంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. బంగాల్​​లోని బాంకుడా జిల్లాలో ఈ ఘటన జరిగింది.

పోలీసులు వివరాల ప్రకారం.. విష్ణుపుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ 37 ఏళ్ల వ్యక్తి ప్రైవేటు ట్యూషన్​ టీచర్​గా పనిచేస్తున్నాడు. ఇంత వయసు వచ్చినా వివాహం కాకపోవడం వల్ల.. పెళ్లి పట్ల ఆత్రుతగా ఉండేవాడు. ఓ బాలిక జననాంగాల నుంచి వచ్చిన రక్తంలో తడిచిన వస్త్రం తెచ్చి ఇస్తే.. తనకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని ఓ మాంత్రికుడు అతడికి చెప్పాడు. దీంతో తాను ట్యూషన్ చెప్పే రెండో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ట్యూషన్​ టీచర్. అనంతరం జరిగిన విషయాన్నంతా బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలికను ఆస్పత్రికి తరలించి.. నిందితుడిపై ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. ట్యూషన్​ టీచర్​ను గత వారమే అరెస్టు చేయగా.. మాంత్రికుడ్ని ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రేయసి కోసం వెళ్లిన ప్రేమికుడు బలి..
బిహార్​లో మూక దాడి కలకలం రేపింది. తన ప్రేయసి కోసం వచ్చిన ఓ ప్రియుడిపై ఓ మూక తీవ్రంగా దాడి చేసి చంపింది. ఈ ఘటన ముజఫర్​పుర్ జిల్లాలో జరిగింది.

అసలు ఏం జరిగిందంటే.. అయాన్​ అనే యువకుడు తన నలుగురు స్నేహితులతో కలిసి తన గర్ల్​ఫ్రెండ్​ను కలవడానికి.. కంతి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని భిమాల్​పుర్ గ్రామంలో ఉన్న ఛఠ్​ పూజ ఘాట్​ వద్దకు వచ్చాడు. యువకుల అనుమానాస్పద కదలికల్ని గమనించిన ఓ మూక వారిపై తీవ్రంగా దాడి చేసింది. దీంతో అయాన్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి ఇద్దరు స్నేహితులు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన అయాన్​ మరో స్నేహితుడ్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

అయితే అయాన్​ మృతదేహంతో బ్రహ్మపుర పోలీస్​ స్టేషన్​ పరిధిలోని మెహెందీ హసన్ చౌరస్తాలో నిరసనకు దిగారు అతడి కుటుంబ సభ్యులు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ఘటన జరిగినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అనంతరం పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం అయాన్​ మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఎస్​కేఎమ్​సీహెచ్​ ఆస్పత్రికి తరలించారు.

ఇవీ చదవండి : 'చాక్లెట్​ చోరీ' వీడియో వైరల్.. అవమానభారంతో యువతి ఆత్మహత్య

నదిలో కొట్టుకుపోతున్న కోతిని కాపాడిన హనుమంతుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.