ETV Bharat / bharat

10 సీట్లతో ఈ-బైక్​.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 100 కి.మీ ప్రయాణం.. ధరెంతో తెలుసా? - బిహార్​ లేటెస్ట్​న్యూస్​

అతడు వృత్తిరీత్యా ఫ్లవర్‌ డెకరేటర్. కానీ ప్రవృత్తిరీత్యా ఆటోమొబైల్‌ ఇంజనీర్. తక్కువ ఖర్చుతోపాటు పర్యావరణానికి మేలు చేసే వాహనాన్ని తయారు చేశాడు. బంగాల్‌కు చెందిన ఈ ఔత్సాహిక ఇంజనీర్‌పై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది. అతడు తయారు చేసిన వాహనం విశేషాలు మీకోసం..

10 seater electric bike made by bangal man

author img

By

Published : Jan 16, 2023, 9:37 PM IST

Updated : Jan 16, 2023, 10:04 PM IST

10 సీట్లతో ఈ-బైక్​.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 100 కి.మీ ప్రయాణం.. ధరెంతో తెలుసా?

సాధారణంగా బైక్​పై ఎంత మంది ప్రయాణిస్తారు?.. ఇద్దరు లేదా ముగ్గురు. కానీ, ఇక్కడ కనిపిస్తున్న ఈ జంబో బైక్ ​పైన మాత్రం ఒకేసారి పది మంది కూర్చొని ప్రయాణించవచ్చు. అది కూడా పెట్రోల్ ఖర్చు లేకుండానే. నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది మాత్రం నిజం. ఈ పది సీట్ల ఎలక్ట్రిక్ బైక్​ను తయారు చేసింది.. ఏదో దిగ్గజ కంపెనీ అనుకుంటే పొరపాటే. వృత్తి రీత్యా ప్లవర్​ డెకరేటర్ అయిన ఓ కుర్రాడు తయారుచేశాడు.

10 seater electric bike made by bangal man
ఛోటన్​ తయారు చేసిన ఈ-బైక్​

బంగాల్​లోని దుర్గాపుర్​ ప్రాంతానికి చెందిన ఛోటన్​ ఘోష్​ అనే యువకుడు ​పర్యావరణహితంగా నడిచే ఈ మెగాసైజ్ ఈ-బైక్​ను తయారుచేశాడు. దీనిపై తన స్నేహితుల్ని కూర్చేబెట్టుకుని రోడ్లపై చక్కర్లు కొడుతున్నాడు​​. తనకు వచ్చిన చిన్న ఆలోచనకే ప్రాణం పోసి రూపొందించాడు. 22 రోజుల పాటు కష్టపడి.. కేవలం రూ.15వేల వ్యయంతోనే ఛోటన్​ తయారుచేశాడు. ఈ జంబో ఈ-బైక్​ తయారీ కోసం పాత కారు సామాగ్రి, ఇనుప పైపులనే ఉపయోగించడం విశేషం. ప్రస్తుతం దీన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు ఎగబడుతున్నారు.

"రెండేళ్ల క్రితమే ఇదే తరహాలో ఓ మోటర్​ బైక్​ను తయారుచేశాను. కానీ దాన్ని రోడ్లపైకి తీసుకువచ్చినప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. దానికి ప్రత్యామ్నాయమే ఈ బ్యాటరీ బైక్.​ సోలార్​ ఎనర్జీ, విద్యుత్​ ఛార్జింగ్​తో ఈ బైక్​ నడుస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపుగా 100 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. కిలోమీటరుకు కేవలం రూ. 8 మాత్రమే ఖర్చవుతుంది. దీనిలో బ్లూటూత్​ సాయంతో పనిచేసే మ్యూజిక్​ సిస్టమ్​ కూడా ఉంది. ఈ తరహా కారును తయారు చేయడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహాయం కోరాను​."
-- ఛోటన్​ ఘోష్​, 10 సీట్ల బైక్​ సృష్టికర్త

ఈ మెగాబైక్​ను తయారుచేయడానికి కుటుంబసభ్యులు, స్నేహితులు ఎంతగానో సహాయం చేశారని ఛోటన్​ తెలిపాడు. ఈ జంబోబైక్​ గురించి తెలుసుకున్న అందరూ ఛోటన్​ను అభినందిస్తున్నారు. దీంతో ఛోటన్​ ఒక్కసారిగా చుట్టుపక్కల గ్రామాల్లో ఫేమస్​ అయ్యాడు.

బైక్​పై స్నేహితుల్ని ఎక్కించుకుని ప్రయాణిస్తున్న చోటన్​

ఇవీ చదవండి:

నదిలో చిక్కుకున్న 'గంగా విలాస్' క్రూయిజ్​ షిప్!​​.. మోటర్​ బోట్ల ద్వారా ఒడ్డుకు పర్యటకులు!!

'అగ్నివీరులతో సాయుధ దళాలకు నయా టెక్ జోష్​'

Last Updated : Jan 16, 2023, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.