VH Demand for CBI Investigation: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి. హనుమంతరావు హైదరాబాద్లోని లిబర్టీలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో దీక్షకు దిగారు. తిరుపతి లడ్డు అంటే ప్రపంచంలోనే చాలా ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు. టీటీడీలో పవిత్రమైన లడ్డు తయారీలో కల్తీ జరిగిందన్న ప్రచారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
తాను చేసిన దీక్షతోనైనా కేంద్ర ప్రభుత్వం విచారణ మొదలుపెట్టాలని కోరారు. లిబర్టీలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో వీహెచ్ ఉదయం 9 గంటల నుంచి 12గంటల వరకు దీక్ష కొనసాగించారు. హిందువుల మనోభావాలతో చెలగాటం ఆడిన వారిని, ఎంతటి వారైనా వదిలి పెట్టకుండా కఠినంగా శిక్షించాలని వీహెచ్ డిమాండ్ చేశారు.