Coffee Benefits For Heart Health : ఛాయ్, కాఫీ.. ఈ రెండింట్లో ఆరోగ్యానికి మేలు చేసేది ఏది? దీనిపై దశాబ్దాలుగా డిబేట్ జరుగుతూనే ఉంది. కొందరు ఛాయ్కు ఓటేస్తే మరికొందరు కాఫీకి జై కొడతారు. అయితే కాఫీ తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయని అంటున్నారు చైనాలోని సూఖౌ యూనివర్సిటీకి చెందిన సుఝౌ మెడికల్ కాలేజీ పరిశోధకులు. వారు రోజూ మూడు కప్పుల కాఫీ తాగే 1.72 లక్షల మంది సమాచారాన్ని విశ్లేషించి ఓ అధ్యయనం చేశారు.
ఈ అధ్యయనంలో ప్రతి రోజూ మూడు కప్పుల కాఫీ తాగుతున్న వారిలో (200-300 మిల్లీగ్రాముల కెఫిన్) గుండె సంబంధిత సమస్యలతో పాటు, స్థూలకాయం, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, ఫ్యాటీ లివర్ వ్యాధులు వృద్ధి చెందే ముప్పును 40-48 శాతం తగ్గినట్లు గమనించారు. ఈ ఫలితాల వివరాలను క్లినికల్ ఎండోక్రోనాలజీ-మెటబాలిజం జర్నల్ ప్రచురించింది.