Temple Without A deity : దేవాలయం అంటేనే మనకు గుర్తుకు వచ్చేది దేవుళ్ల విగ్రహాలు. కానీ దేవిలేని దేవాలయం ఉందంటే నమ్మగలరా? నిజంగానే ఉందండి. అది ఎక్కడో కాదు మన రాష్ట్రంలోనే. ఆ వివరాలివే. పెద్దపల్లి జిల్లా ధర్మాబాద్‌లో మూడు వందల ఏళ్ల నాటి ఆలయం ఉంది. ఎరబాటి లక్ష్మీనరసింహరావు అనే భూస్వామి దీని నిర్మాణం చేపట్టాడు. ఈ గుడికి దగ్గర్లోనే రంగనాయక స్వామి ఆలయం ఉంది.
దాని పక్కన ఆండాళ్లమ్మ ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. త్రికూట పద్ధతిలో మూడు గోపురాలూ-వాటిపైన కల్యాణ వైభవాన్ని చాటే శిల్పాలనూ చెక్కించాడు. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ చేయించాలనుకునేంతలోనే లక్ష్మీ నరసింహ రావు కన్నుమూశాడట. ఇంతలో ఆలయంలోని విగ్రహాలను ఎవరో తస్కరించారట. ఇన్ని ఆటంకాలు చూసి ఏమనుకున్నారో ఏమో గానీ గుడి నిర్మాణాన్ని నిలిపివేశారు. నాటి నుంచి దేవిలేని ఆలయం అంటూ పర్యాటకులు సందర్శిస్తున్నారు.