ETV Bharat / snippets

రేషన్​బియ్యం అక్రమ నిల్వలపై పోలీసు ఉక్కుపాదం - జనగామలో 600 క్వింటాళ్లు స్వాధీనం

600 quintals seized in Jangoan
Task Force Police Caught 600 Quintals of PDS Rice (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 1:35 PM IST

Task Force Police Caught 600 Quintals of PDS Rice : జనగామ జిల్లా జఫర్ గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి, భారీగా పీడీఎస్​ బియ్యాన్ని పట్టుకున్నారు. అక్రమంగా పీడీఎస్​ బియ్యాన్ని నిల్వ చేశారన్న సమాచారంతో టాస్క్​ఫోర్స్, జఫర్ గడ్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో సుమారు రూ.15,60,000 విలువ చేసే 600 క్వింటాళ్ల​ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందింది. దీంతో వరంగల్ పోలీస్ కమిషనర్ కిషోర్ ఝా ఆదేశాలతో టాస్క్​ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో బాలాజీ రైస్ మిల్లు, వెంకటాపూర్ గ్రామంలో నిల్వ ఉంచిన అక్రమ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.