ETV Bharat / snippets

పాతబస్తీలో ముజ్రా పార్టీ - 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Mujra party at Bandlaguda in hyd
Police Busted Mujra party at Bandlaguda (ETV Bharat)

Police Busted Mujra party at Bandlaguda : హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ముజ్రా పార్టీ నిర్వహించిన 12 మందిని దక్షిణ మండలం టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 28న అర్ధరాత్రి నలుగురు ట్రాన్స్​జెండర్లతో కలిసి 8 మంది వ్యక్తులు లేక్ వ్యూ హిల్స్ గౌస్​నగర్ ప్రాంతంలో ముజ్రా పార్టీ నిర్వహించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు, వారి నుంచి ఒక యాంప్లిఫయర్, లౌడ్ స్పీకర్ బాక్స్ స్వాధీనం చేసుకున్నారు. నలుగురు ట్రాన్స్​జెండర్లతో కలిసి అశ్లీల నృత్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. ప్రస్తుతం నిర్వాహకుడు పరారీలో ఉన్నాడు. ఈ మేరకు బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.