ETV Bharat / snippets

పిల్లల దత్తత ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించాలి : మంత్రి సీతక్క

author img

By ETV Bharat Telangana Team

Published : May 31, 2024, 4:35 PM IST

Seethakka on Adoption Process
Seethakka Visit Shishu Vihar in Hyd (ETV Bharat)

Minister Seethakka on Adoption : పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటే చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు. చట్టబద్ధంగా, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు దత్తత తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని మంత్రి అన్నారు. యూసుఫ్​గూడలోని శిశు విహార్​ను ఆమె సందర్శించారు. ఇటీవల అక్రమ రవాణా నుంచి పోలీసులు విముక్తి కల్పించిన చిన్నారులను పరామర్శించారు.

చిన్నారుల యోగక్షేమాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా చూసుకోవాలని, ఎలాంటి లోటు రానీయొద్దని సూచించారు. దత్తత ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వారికి తగిన సలహాలు ఇవ్వాలని అధికారులకు తెలిపారు. మహిళ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ నిర్మల కాంతి వెస్లీ తదితరులు మంత్రి వెంట ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.