ETV Bharat / snippets

ఆర్​ఆర్​ఆర్​ ఉత్తర భాగం భూ సేకరణను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి

NORTHERN REGIONAL RING ROAD IN TG
Minister Komatireddy review on RRR (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 19, 2024, 10:31 PM IST

Minister Komatireddy review on RRR : రీజినల్ రింగు రోడ్డు ఉత్తర భాగానికి భూసేకరణ ప్రక్రియను వచ్చే నెల 15 నాటికి పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగం కోసం ఇప్పటి వరకు 1941 హెక్టార్ల భూసేకరణ దాదాపు పూర్తయిందన్నారు. ట్రిపుల్​ ఆర్​పై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మహబూబాబాద్​లో ఇబ్బందిగా ఉన్న అటవీ భూముల సమస్యకు కూడా పరిష్కారం చూపినట్లు మంత్రి పేర్కొన్నారు.

భూములకు మంచి ధర ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని, రైతులు అధైర్యపడకుండా భూసేకరణకు సహకరించాలని మంత్రి కోరారు. ఎన్​హెచ్ 65ని ఆరు లేన్లుగా విస్తరించేందుకు త్వరలోనే డీపీఆర్ సిద్ధం చేస్తామని, దీనికి సంబంధించిన కన్సల్టెంట్ల నియామకం కోసం ఇప్పటికే టెండర్లు పిలిచినట్లు మంత్రి వివరించారు. ఎన్​హెచ్​-65 పై 17 బ్లాక్​స్పాట్ల తొలగింపు కోసం 422 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులను నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.